IND vs SA: సౌతాఫ్రికా వర్సెస్ భారత్ తొలి వన్డే వర్షార్పణం కానుందా? జోహన్నెస్‌బర్గ్‌లో భారత రికార్డు ఇలా ..

టీమిండియా తుది జట్టులో సంజూ శామ్సన్ కు అవకాశం దక్కుతుందా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. రింకు సింగ్ ఇవాళ్టి మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలకు కూడా ..

IND vs SA: సౌతాఫ్రికా వర్సెస్ భారత్ తొలి వన్డే వర్షార్పణం కానుందా? జోహన్నెస్‌బర్గ్‌లో భారత రికార్డు ఇలా ..

IND vs SA ODI Series

Updated On : December 17, 2023 / 10:24 AM IST

IND vs SA 1st ODI Match : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవుతుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలో విజయమే లక్ష్యంగా టీమిండియా జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో రింకూ సింగ్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ విషయంపై తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ క్లారిటీ ఇచ్చారు. రింకూ సింగ్ తో పాటు సంజూ శాంసన్ కూడా తది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ మీడియాతో తెలిపారు. ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీపై పోటీ కొనసాగుతుంది. రోహిత్ శర్మ మరికొద్దిరోజుల్లో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మధ్య కెప్టెన్సీపై పోటీ నెలకుంటుందని పలు మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తే దీర్ఘకాలం వన్డే కెప్టెన్సీ లభించే అవకాశాలు కొట్టిపారేయలేం.

Also Read : Rohit Sharma : రోహిత్ శర్మ భార్య రితికా ఆసక్తికర ట్వీట్.. నెటిజన్లు ఫుల్ సపోర్ట్.. ఎందుకంటే?

తొలి వన్డేకు వర్షం ముప్పు ..?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. మిగిలిన రెండు మ్యాచ్ లలో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ ను గెలుచుకోవటంతో సిరీస్ డ్రా అయింది. వన్డే సిరీస్ లోనూ వర్షం ముప్పు పొంచి ఉంది. తొలి వన్డే జరిగే జోహన్నెస్‌బర్గ్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లో ఉదయం 11గంటలకు (భారత్ కాలమానం ప్రకారం 1.30గంటలకు) ప్రారంభమవుతుంది. రాత్రి 7గంటలకు (సౌతాఫ్రికా కాలమానం ప్రకారం) మ్యాచ్ ముగుస్తుంది. ఈ సమయంలో వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ.. సాయంత్రం 5 నుంచి రాత్రి 7గంటల మధ్యలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడి వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం కేవలం 2 నుంచి 5శాతం మాత్రమే ఉందట. అదే జరిగితే వన్డే మ్యాచ్ కు వర్షం ముప్పు దాదాపు లేనట్లేనని చెప్పొచ్చు. పగటి వేళ మ్యాచ్ జరుగుతున్నందున ముంచు ప్రభావం ఉండదు.

Also Read : Rohit Sharma : కెప్టెన్సీ మార్పు.. ముంబైకి షాక్ ఇస్తున్న ఫ్యాన్స్‌.. 4 ల‌క్ష‌ల మంది వెళ్లిపోయారు

భారత్ రికార్డును పరిశీలిస్తే..
జోహన్నెస్‌బర్గ్ లోని ‘ది వాండరర్స్’ స్టేడియంలో ఇవాళ సౌతాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య తొలి వన్డే జరుగుతుంది. ఈ స్టేడియం భారీ స్కోర్ చేసేందుకు వీలుగా ఉంటుంది. గత నాలుగు వన్డేల్లో మూడు సార్లు 300 పై స్కోర్లు నమోదయ్యాయి. మూడు సార్లు 400 మార్కు దాటి స్కోర్ నమోదైంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోర్ పై దృష్టి పెట్టనుంది. ఇక్కడి మైదానంలో ఇండియా వన్డే రికార్డు పేవలంగా ఉంది. భారత్ ఇక్కడ 8 మ్యాచ్ లు ఆడగా.. ఐదు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసింది. అయితే, ఈ మైదానంలో దక్షిణాఫ్రికా 40 మ్యాచ్ లు ఆడగా 30 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టిచూస్తే ఇవాళ్టి వన్డేలో భారత్ జట్టు విజయం సాధించాలంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించాల్సిందే.

Also Read : Rohit Sharma : చెన్నై జ‌ట్టులోకి రోహిత్ శ‌ర్మ వ‌స్తే.. సీఎస్‌కే మాజీ ఆట‌గాడి పోస్ట్ వైర‌ల్‌

తుది జట్టులో స్థానం ఎవరికి..
టీమిండియా తుది జట్టులో సంజూ శామ్సన్ కు అవకాశం దక్కుతుందా? అనే అంశం ఆసక్తికరంగా మారింది. రింకు సింగ్ ఇవాళ్టి మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మలకు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. సంజూ శామ్సన్ కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. కీపర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు. అయితే, సంజూ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయని రాహుల్ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మరోవైపు బౌలింగ్ విభాగంలో సీనియర్లు షమీ, సిరాజ్, బుమ్రాలు ఎవరూ లేరు. దీంతో ముకేశ్ కుమార్, అర్ష్ దీప్, అవేశ్ ఖాన్ పైనే భారం ఉంటుంది. కుల్దీప్ యాదవ్ కు తుది జట్టులో చోటు ఖాయంకాగా.. అక్షర్ పటేల్, చహర్ లలో ఎవరు తుది జట్టులో చేరుతారనేది ఆసక్తికర అంశంగా మారింది.

భారత్ జట్టు (అంచనా) ..
రుతురాజ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్/ సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, రింకు సింగ్, అక్షర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్ దీప్ యాదవ్, ముకేశ్ కుమార్.

దక్షిణాఫ్రికా జట్టు (అంచనా) ..
హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, డసెన్, మార్ క్రమ్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ముల్డర్, బర్గర్, షంసి, విలియమ్స్