Yogi Adityanath: ఇలాగైతేనే ఇండియా స్ట్రాంగ్ అవుతుంది: యోగి ఆదిత్యనాథ్
మహా కుంభమేళా సందేశం ఐక్యత, సమగ్రతేనని యోగి ఆదిథ్యనాథ్ తెలిపారు.

Yogi Adityanath
ఉత్తరప్రదేశ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సనాతన ధర్మం, దేశ అభివృద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యతా సందేశాన్ని ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు. దేశ ఐక్యతే మహాకుంభ మేళా సందేశమంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. అందుకే “ఐక్యత”ను ఉద్దేశిస్తూ యోగి ఆదిత్యనాథ్ ఇవాళ పలు వ్యాఖ్యలు చేశారు.
మహా కుంభమేళా సందేశం ఐక్యత, సమగ్రతేనని యోగి ఆదిథ్యనాథ్ తెలిపారు. ఈ సందేశం ప్రపంచానికి వెళ్లాలని అన్నారు. మహా కుంభమేళలో భాగమైన సాధువులు, భక్తులు, పర్యాటకులు అందరూ ఐక్యతా సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తే.. సనాతన ధర్మం బలపడుతుందని చెప్పారు. సనాతన ధర్మం పటిష్ఠంగా ఉంటేనే మన దేశం బలపడుతుందని అన్నారు.
కాగా, మహాకుంభ మేళాకు హాజరయ్యే భక్తులకు అవసరమైన సేవలు, సమాచారం అందించడానికి అధికారులు ఏఐను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది సందర్శకుల కోసం కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తూ ఏఐలోనూ మార్పులు తీసుకొస్తున్నారు.
Indiramma Illu: ఇందిరమ్మ ఇంటికోసం అప్లయ్ చేశారా..? ఫైనల్ లిస్ట్ ఎప్పుడు.. ఎలా చెక్‌చేసుకోవాలంటే..
మరోవైపు, మౌని అమావాస్య (జనవరి 29న) నేపథ్యంలో రైల్వే శాఖ కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను లక్నోకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్ సత్యేంద్ర మోహన్ శర్మ మీడియాకు వివరించారు. మౌని అమావాస్య కోసం ప్రత్యేకంగా ఇప్పటికే షెడ్యూల్ చేసిన 48 ప్రత్యేక రైళ్లతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న 11 రెగ్యులర్ స్పెషల్ రైళ్లు కూడా నడుస్తాయని తెలిపారు.
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈ ప్రత్యేక రైళ్లు లక్షలాది మంది భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేస్తాయని తెలిపారు. మహాకుంభమేళలో శుక్రవారం నాటికి 10.80 కోట్ల మంది భక్తులు గంగా, యమునా, సరస్వతి సంగమం వద్ద పవిత్ర స్నానాలాచరించారు. చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జనవరి 29న జరగనున్న మౌని అమావాస్యకు భక్తులు మరింత పెద్ద సంఖ్యలో వస్తారనే అంచనాలతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు.
Balakrishna : పద్మ భూషణ్ పురస్కారంపై తొలిసారి స్పందించిన బాలయ్య..