చరిత్రలో తొలిసారిగా Air India CEOగా మహిళ

  • Published By: nagamani ,Published On : October 31, 2020 / 01:45 PM IST
చరిత్రలో తొలిసారిగా Air India CEOగా మహిళ

Updated On : October 31, 2020 / 2:26 PM IST

Indian Airlines fist Women CEO : భారత ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిరిండియా కొత్త CEOను నియమించింది. చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళను CEOగా ‘‘హర్‌ప్రీత్‌ సింగ్‌’’ను నియమించింది. ఎయిర్ ఇండియా ఛీఫ్‌గా హర్ ప్రీత్ సింగ్ ను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఎయిర్‌ ఇండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ శుక్రవారం (అక్టోబర్ 30,2020) ఉత్తర్వులు జారీ చేశారు.


హర్‌ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా విమాన భద్రత విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో హర్ ప్రీత్ CEOగా నియమితులు కావటంతో ఆమె స్థానంలో ఎయిర్‌ ఇండియా కొత్త ఈడిగా కెప్టెన్ నివేదా భాసిన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.



https://10tv.in/the-first-ever-seaplane-services-in-gujarat-to-start-soon/
కాగా..హర్‌ప్రీత్ సింగ్ 1988లో ఎయిర్‌ ఇండియాకు ఎంపికైన మొట్టమొదటి మహిళ పైలెట్ కావటం మరోవిశేషం‌. ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమె విమానంలో ప్రయాణించలేక పోయినప్పటికి..విమానాల భద్రత విషయంలో చాలా చురుకుగా వ్యవహరించేవారు. హర్ ప్రీత్ ఇండియన్ ఉమెన్ పైలట్ అసోసియేషన్‌కు అధ్యక్షత వహిస్తున్నారు.


ఈ అసోసియేషన్‌లో భాసిన్, కెప్టెన్ క్షమాతా బాజ్‌పాయ్ వంటి ఇతర సీనియర్ మహిళా కమాండర్లు ఉన్నారు. వీరంతా పైలట్లచే రోల్ మోడల్‌గా ఉన్నారు.