Corona Update : దేశంలో 8 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corona Cases (2)
Corona Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24గంటల్లో 249 మంది మృతిచెందారని బులిటెన్‌లో పేర్కొంది.
చదవండి : Corona : 29 మంది విద్యార్థినిలకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,18,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 12,510 మంది కరోనా నుంచి కోలుకోని ఇళ్లకు వెళ్లారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 5080 కేసులు ఉన్నాయి. మరో 40 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే.. కేరళలో మాత్రం కరోనా ఉదృతి తగ్గడం లేదు.
చదవండి : Corona Cases : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కేరళలో మాత్రం