దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా కన్నుమూత..

వ్యాపారంలో విలువలు పాటించారు. దాతృత్వంలో గుర్తింపు పొందారు.

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా కన్నుమూత..

Ratan Tata (Photo Credit : Google)

Updated On : October 10, 2024 / 12:22 AM IST

Ratan Tata Passed Away : ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ అధినేత రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం ముంబైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ రతన్ టాటా కన్నుమూశారు. దిగ్గజ వ్యాపారవేత్త, అంతకు మించి గొప్ప మానవతావాది ఇకలేరనే వార్త యావత్ దేశంలో శోకం నింపింది.

రతన్ టాటా వయసు 86 ఏళ్లు. 1937 డిసెంబర్ 28 న ముంబైలో నావల్ టాటా – సోనీ టాటా దంపతులకు జన్మించారు. పదేళ్ల వయసులోనే రతన్ టాటా తల్లిదండ్రులు విడిపోయారు. పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబలో ఆయన పుట్టారు. భారత దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్ నకు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతి రతన్ టాటా. దేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు. వ్యాపారంలో విలువలు పాటించారు. దాతృత్వంలో గుర్తింపు పొందారు.

* రతన్ టాటా 1991లో ఆ సంస్థకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
* తన ముత్తాత స్థాపించిన గ్రూప్‌ను 2012 వరకు నడిపారు.
* 1996లో టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలీ సర్వీసెస్‌ను ప్రారంభించారు.
* 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించారు.
* దేశంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా గుర్తింపు.
* అంతకుమించి గొప్ప మానవతా వాది.
* టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
* టాటా గ్రూప్ సంస్థను జాతీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.
* టాటా గ్రూప్‌ ఛారిటబుల్ ట్రస్టులకు నాయకత్వం వహిస్తున్నారు.
* వ్యాపార రంగంలో రతన్ టాటా సేవలకు గుర్తింపుగా 2000లో పద్మ భూషణ్ వరించింది.
* 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో కేంద్రం సత్కరించింది.
* ఉప్పు నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు అన్ని వ్యాపారాల్లోనూ అగ్రస్థానం.
* సక్సెస్ తప్ప ఓటమి ఎరుగని ధీరుడిగా రతన్ టాటాకు పేరు.

Also Read : రతన్ టాటా సక్సెస్ స్టోరీ.. యువతరానికే స్ఫూర్తిదాయకం.. వ్యాపార దిగ్గజంగా ఎలా ఎదిగారంటే?