పాక్ బంకర్లపై మిసైల్స్ తో భారత్ మెరుపు దాడి…వీడియో రిలీజ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2020 / 07:04 PM IST
పాక్ బంకర్లపై మిసైల్స్ తో భారత్ మెరుపు దాడి…వీడియో రిలీజ్

Updated On : November 13, 2020 / 7:26 PM IST

Indian Missiles, Rockets Score Direct Hits On Pak Bunkers నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడిన పాకిస్తాన్ కు భారత్ ధీటుగా బదులిచ్చింది. పాక్ కాల్పులను ధీటుగా తిప్పకొట్టడమే కాకుండా పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. భారత్ దెబ్బతో పాక్ కు దిమ్మతిరిగా మైండ్ బ్లాక్ అయింది.



వాస్తవాధీన రేఖ(LoC)వెంట పలు పాకిస్తాన్ పోస్ట్ లను భారత ఆర్మీ ధ్వంసం చేసిన వీడియోలు బయటికొచ్చాయి. భారత ఆర్మీనే ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత ఆర్మీ ధ్వంసం చేసిన వాటిలో… పాక్ ఆయుధ సామాగ్రిని కలిగి ఉన్న ప్రదేశం, ఆయిల్ నిల్వల బిల్డింగ్ లు,ఎల్ వోసీ వెంట చొరబడేందుకు ఉగ్రవాదులకు సహాయంగా పాక్ సిద్ధంగా ఉంచిన లాంచ్ ప్యాడ్ లు కూడా ఉన్నాయి.




భారత ఆర్మీ షేర్ చేసిన ఓ వీడియోలో… పాక్ భూభాగంలోని ఓ బంకర్ లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ఓ మిసైల్ ఫైర్ చేయడంతో ఓ పాక్ జవాను తనను కాపాడుకునేందుకు పరుగు తీస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్ వదిలిన మిసైల్ నేరుగా పాక్ బంకర్ ని ఢీ కొట్టగా… కొన్ని సెకన్ల వ్యవధిలోనే అదే బంకర్ పైకి మరో రెండు మిసైల్స్ ని వదిలింది ఆర్మీ.




కాగా,నియంత్రణరేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే పాక్ ఉల్లంఘిస్తోంది. ఇవాళ ఎల్ వోసీ వెంబడి దవార్,కేరన్,ఉరి,నౌగమ్ సైక్టార్లలో భారీ ఆయుధాలు,మోటర్లతో పాక్ జవాన్లు భారత సైనికులపై దాడికి దిగారు. పాక్ కాల్పులను భారత్ ధీటుగా ఎదుర్కొంది. ఈ క్రమంలో నలుగురు భారత సైనికులు అమరులవ్వగా,8మంది పాక్ సైనికులు మృతిచెందారు. భారత్ భూభాగంలోని పలువురు పౌరులు కూడా పాక్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు.