Vande Metro Services : వందే భారత్ తరహాలో.. త్వరలో దేశంలో వందే మెట్రో సర్వీసులు

దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి. కీలక మార్గాల్లో ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి అదనంగా వందేభారత్ తరహాలోనే వందే మెట్రో సర్వీసులను కూడా తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్.

Vande Metro Services : వందే భారత్ తరహాలో.. త్వరలో దేశంలో వందే మెట్రో సర్వీసులు

Updated On : February 5, 2023 / 12:12 AM IST

Vande Metro Services : దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి. కీలక మార్గాల్లో ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి అదనంగా వందేభారత్ తరహాలోనే వందే మెట్రో సర్వీసులను కూడా తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్. నగరాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రయాణాలను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకి మినీ వెర్షనే.. ఈ వందే మెట్రో. ఈ ఏడాది చివరి నాటికి వందే మెట్రో డిజైన్, ప్రొడక్షన్ పూర్తి కానుంది. శివారు ప్రాంత ప్రజలను నగరాలతో కనెక్ట్ చేయడమే వందే మెట్రో సర్వీస్ లక్ష్యం. పెద్ద నగరాల చుట్టుపక్కల ప్రాంతాల్లో వందే మెట్రో సర్వీసులు తీసుకురానున్నారు.

నగరాలకు రాకపోకలను సులభతరం చేసేందుకే వందే మెట్రో. వందే మెట్రో రూట్ లో చిన్న స్టేషన్లు కవర్ కానున్నాయి. 60-70 కిలోమీటర్ల మధ్య ఉన్న పట్టణాల మధ్య ఈ వందే మెట్రో అందుబాటులోకి రానుంది. వీటి ఉత్పత్తికి సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.