శారీరకంగా కాదు.. ఆధ్యాత్మిక శక్తే భారతీయులను కరోనా నుంచి రక్షిస్తోంది.. చైనా టాప్ సైంటిస్ట్

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 06:47 AM IST
శారీరకంగా కాదు.. ఆధ్యాత్మిక శక్తే భారతీయులను కరోనా నుంచి రక్షిస్తోంది.. చైనా టాప్ సైంటిస్ట్

Updated On : April 28, 2020 / 6:47 AM IST

భారతదేశంలోని ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించేది శారీరక రోగనిరోధక శక్తి కాదు.. మానసికంగా (అధ్యాత్మికం) శక్తి కూడా రక్షిస్తోందని చైనా టాప్ సైంటిస్టు చెప్పారు. ‘భారతదేశంలో మతపరమైన అంశాలకు ఫేస్ మాస్క్‌లు ధరించకుండా ఒకేచోట చేరినట్టు ఒక వార్త చూశాను.. కొవిడ్-19కు భారతీయులు శారీరకంగా నిరోధక శక్తి ఉన్నవారు కాదు. వారంతా ఆలోచనలో ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉన్నారని అర్థమైంది’ అని Zhang Wenhong అనే చైనీస్ సైంటిస్టు తమ దేశీయ విద్యార్థులకు వివరించారు. భారత్ లోని చైనా ఎంబసీలో ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన తెలిపారు. ‘భారతీయులు ప్రశాంతమైన మనస్సును కలిగి ఉన్నారని జాంగ్ చెప్పారు. షాంఘైలోని Huashan Hospital’s Department of Infectious Disease డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 

భారత్‌లో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నప్పటికీ యూనైటెడ్ స్టేట్స్‌లోని కరోనా కేసుల స్థాయితో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ఆయన తెలిపారు. భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు కరోనా పాజిటివ్ ధ్రువీకరణ కేసులు పెరుగుతున్నాయి. కానీ, అమెరికా జనాభా కన్నా భారతదేశం అతిపెద్ద జనాభాగల దేశం.. వాస్తవానికి వైరస్ ఇన్ఫెక్షన్ల రేటు భారత్ కంటే అమెరికాలోనే తక్కువగా ఉందని జాంగ్ అభిప్రాయపడ్డారు. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 10 శాతం కంటే పెరగదన్నారు. అందుకే 90 శాతం మంది వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉన్నారని చైనీస్ విద్యార్థులకు నొక్కి చెప్పారు. 

 

భారతదేశంలో 23వేల మందికి Sars-Cov-2 వైరస్ సోకిందని, మరో 718 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. ప్రస్తుతం ఇండియాలో 17,610 యాక్టివ్ కేసులు ఉండగా, 4,749 మంది కోలుకున్నారు లేదా వలస వెళ్లిపోయారు. 718 మంది మరణించారు. కొవిడ్-19 టాలీ ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 23,077 కరోనా కేసులు చేరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్యాష్ బోర్టులో పేర్కొంది. 31వ రోజు జాతీయ లాక్ డౌన్ విధించిన తర్వాత ఈ గణాంకాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 2,708, 470 మందికి కరోనా వైరస్ సోకగా, 1,90,788 మంది మృతిచెందారు.