Vertical Transmission : గర్భస్థ శిశువుకు కరోనా

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 09:40 AM IST
Vertical Transmission : గర్భస్థ శిశువుకు కరోనా

Updated On : July 29, 2020 / 11:01 AM IST

కరోనా ముప్పుతిప్పలు పెడుతోంది. ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా…ప్రతొక్కరికీ వైరస్ సోకుతోంది. ఇందులో గర్భం దాల్చిన వారు కూడా ఉన్నారు. కానీ తల్లి నుంచి గర్భస్థ శిశువుకు కరోనా వైరస్ (Vertical Transmission) సోకింది.



పుణెలో ససూన్ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గర్భంలో ఉన్న శిశువుకు ఆక్సిజన్, పోషకాలు అందించే క్రమంలో…వైరస్ బిడ్డకు సోకిందన్నారు. కాన్పు తర్వాత..సాధారణంగా..తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకవచ్చని ససూన్ ఆసుపత్రిలో చిల్డ్రన్ విభాగాధిపతి ఆర్తి కినికర్ తెలిపారు.

తల్లి పాలు ఇచ్చేటప్పుడు కానీ ఇతరత్రా స్పర్శల ద్వారా కానీ కరోనా వైరస్ సోకే వీలుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జన్మించే సమయంలో శిశువుకు వైరస్ సోకదని, కానీ…పుట్టిన తర్వాత..3-4 రోజుల్లో ఈ వ్యాధి సోకే వీలుందన్నారు. అయితే..తాజా కేసులో కాన్పునకు వారం ముందు నుంచి..తల్లికి కరోనా లక్షణాలు ఉన్నాయన్నారు.



కరోనా పరీక్షలు నిర్వహించగా..ఫలితం వచ్చిందన్నారు. కాన్పు అనంతరం శిశువు యొక్క బొడ్డు తాడు, మాయ నుంచి నమూనాలు సేకరించి..పరీక్షించినట్లు వెల్లడించారు. శిశును రెండు వారాల పాటు…ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందించామని, ప్ర్సతుతం తల్లి, బిడ్డను డిశ్చార్జ్ చేశామన్నారు.