IIT Scientists : మే-15నాటికి దేశంలో రోజుకి 35లక్షల యాక్టివ్ కరోనా కేసులు
భారత్ లో మే 11-15 మధ్య రోజుల్లో రోజుకి 33-35లక్షల యాక్టివ్ కేసులతో కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడనుంది ఐఐటీ సైంటిస్టులు వెల్లడించారు.

Indias Covid Graph May Peak At 33 35 Lakh Active Cases By May 15 Iit Scientists
IIT Scientists భారత్ లో మే 11-15 మధ్య రోజుల్లో రోజుకి 33-35లక్షల యాక్టివ్ కేసులతో కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడనుంది ఐఐటీ సైంటిస్టులు వెల్లడించారు. మే ప్రధమార్ధంలో కరోనా వైరస్ ముమ్మర దశకు చేరుకుని నెల చివరికి తగ్గుముఖం పడుతుందని తెలిపారు. ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించిన గణాంక పద్థతి ప్రకారం.. ప్రస్తుతం 24.28 లక్షలుగా ఉన్న కొవిడ్ యాక్టివ్ కేసులు మే 15 నాటికి పది లక్షలు పెరిగి 33-35 లక్షలకు ఎగబాకుతాయని ఆపై క్రమంగా దిగివస్తాయని వెల్లడైంది.
ఐఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తలు అనుమానిత, గుర్తించని, టెస్టెడ్ (పాజిటివ్), రిమూవ్డ్ అప్రోచ్ (సూత్ర) మోడల్ లో ఈ అంచనాకు వచ్చారు. ఏప్రిల్ 25-30 నాటికి ఢిల్లీ, హర్యానా, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక తాజా కేసులు వెలుగుచూస్తాయని సైంటిస్టులు అంచనా వేశారు. ఇక మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు ఇప్పటికే నూతన కేసుల్లో ముమ్మర దశకు చేరాయని తెలిపారు.. మే నెల చివరినాటికి కొవిడ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఐఐటీ కాన్పూర్ సీఎస్ఈ విభాగం ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.
కాగా, ఈ నెల ప్రారంభంలొ..గణాంక పద్థతి ప్రకా ఏప్రిల్ 15 నాటికి దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసులు పెరుగుతాయని ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేసినప్పటికీ అది నిజం కాలేదు. ప్రస్తుత దశ కోసం మా నమూనాలోని పారామీటర్స్ నిరంతరం మారుతున్నాయి. కాబట్టి వాటి విలువను సరిగ్గా పొందడం చాలా కష్టం అని అగర్వాల్ అన్నారు. ప్రతి రోజు కొంచెం మార్పు కూడా గరిష్ట సంఖ్యలను అనేక వేల వరకు మారుస్తుంది అని ఆయన వివరించారు. అయితే, జువారీ కొత్త కేసుల డేటాకు SUTRA మోడల్ యొక్క అంచనా సున్నితంగా ఉంటుందని చెప్పారు. మహమ్మారి యొక్క కోర్సును అంచనా వేయడానికి ఈ మోడల్ మూడు ప్రధాన పారామితులను ఉపయోగిస్తుందని అగర్వాల్ గుర్తించారు.