లక్ష కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ‘వందే భారత్’ ఎక్స్ ప్రెస్

మేకిన్ ఇండియా ఇన్షియేటివ్‌గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు’ లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ రైలు ప్రారంభోత్సవం జరిగింది.
3నెలలుగా ఒక్క ట్రిప్‌లోనూ విరామం తీసుకోకుండా ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగించి మే15 బుధవారం చేరుకుంది. ఈ ప్రయాణం ముగిసేసరికి కాన్పూర్ సమీపంలో రైలు లక్ష కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంది.
చూసేందుకు బుల్లెట్ రైలు షేపులో కనిపించే ట్రైన్ మరిన్ని ప్రత్యేకతలతో నిండిఉంది. అన్నీ బోగీలోను ఏసీలు, ఆటోమేటిక్ డోర్లు, ఆన్-బోర్డు వైఫై, GPS-ఆధారిత ప్రయాణీకులకు ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీస్, టచ్-ఫ్రీ బయో-వాక్యూమ్ టాయిలెట్, LED లైటింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు,వాతావరణ నియంత్రణ వ్యవస్థ, 360 డిగ్రీల కోణంలో తిరుగే సీట్లు ఇలాంటి సదుపాయలు ఎన్నో ఉన్నాయి.
‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్‘ రైలు లక్ష కిలోమీటర్లను పూర్తిచేసుకుందనే సమాచారాన్ని రైల్వే ప్రత్యేక అధికారి వెల్లడించారు.