Praggnanandhaa : ప్రజ్ఞానందకు లేఖ రాసిన ఇండిగో క్రూ.. అందులో ఏం రాశారంటే?
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండిగో క్యాబిన్ క్రూ ప్రజ్ఞానందకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. ఇండిగో సిబ్బంది ఓ స్పెషల్ నోట్ రాసిచ్చారు.

Praggnanandhaa
Praggnanandhaa : అజర్‌బైజాన్‌లో జరిగిన FIDE ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద ఇండియాకు వచ్చారు. దోహా నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న విమానంలో ఇండిగో క్యాబిన్ సిబ్బంది నుంచి ఆయన ఓ స్పెషల్ నోట్ అందుకున్నారు. అందులో వారు ఏం రాశారంటే?
FIDE ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత దేశంలో అడుగుపెట్టిన వెంటనే ప్రజ్ఞానందకు ఘన స్వాగతం లభించింది. అంతకు ముందు దోహా నుండి చెన్నైకి ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో ఇండిగో క్యాబిన్ సిబ్బంది ప్రజ్ఞానందకు ఒక నోట్ రాసిచ్చారు. అందులో ‘ ప్రియమైన ప్రజ్ఞానంద, ఈరోజు మీరు మాతో విమానంలో ప్రయాణించడం నిజంగా మాకు గౌరవంతో పాటు ఆనందంగా ఉంది. మీరు మా దేశానికి గర్వ కారణం. మీరు భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. మీరు నిజంగా మా అందరికీ స్ఫూర్తి దాయకం. మీ ఆటను కొనసాగించండి. అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండండి’ అంటూ చేతిరాతతో ప్రత్యేకంగా లేఖ రాసారు. ప్రజ్ఞానంద అతని తల్లి నాగలక్ష్మి అటెండర్‌తో ఉన్న ఫోటోతో పాటు ఈ లేఖను ఎయిర్ లైన్ ట్విట్టర్‌లో (@IndiGo6E) పోస్ట్ చేసింది.
Anand Mahindra : ప్రజ్ఞానంద పేరెంట్స్‌కి ఆనంద్ మహీంద్రా ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
ఆ పోస్టుకి ‘చెస్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తున్నారు. భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్ మాస్టర్ ప్రజ్ఞానానందను బోర్డులో ఉంచడం మాకు గౌరవంగా ఉంది. మొట్టమొదటి ప్రపంచ కప్ ఫైనలిస్ట్‌గా నిలిచినందుకు యువ ఛాంపియన్‌కు అభినందనలు’ అంటూ ఇండిగో తమ పోస్టుకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
✈️ Taking chess to new heights! ? We were honored to have Indian chess grandmaster Master R Praggnanandhaa on board. Congratulations to the young champion on becoming the first-ever World Cup finalist!#goIndiGo #IndiaByIndiGo pic.twitter.com/RmwcMjmy3H
— IndiGo (@IndiGo6E) August 31, 2023