International Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే

సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల్పించడం మాత్రం ఇదే మొదటిసారి.

International Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే

Updated On : March 8, 2023 / 11:12 AM IST

International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం, మార్చి 8న ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ‘బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)’.

Kangana Ranaut : కంగనా రనౌత్ ఫేవరేట్ సినిమాలు ఇవే.. మీరు చూశారా?

మహిళా దినోత్సవమైన బుధవారం రోజు బెంగళూరులో మహిళలు ఏ బస్సులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చని బీఎంటీసీ ప్రకటించింది. సాధారణ బస్సులతోపాటు నగర పరిధిలోని ప్రీమియర్ ఏసీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. కెంపెగౌడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు నడిపే వజ్ర, వాయు వజ్ర సర్వీసుల్లోనూ టిక్కెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. మహిళలు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ వాడే బదులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు వాడాల్సిందిగా బీఎంటీసీ అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుందని, ఇది సురక్షితమైన ప్రయాణమని అంటున్నారు.

H3N2 Influenza Virus : మళ్లీ మాస్క్ తప్పదా? కరోనా కంటే వేగంగా వ్యాపిస్తూ భయపెడుతున్న కొత్త వైరస్, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

దీనివల్ల నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా మెరుగవుతుందని అభిప్రాయపడింది. గతంలో బెంగళూరులో ఒక్కసారి మాత్రమే బస్సుల్లో బీఎంటీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బీఎంటీసీ ఏర్పడి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా గత ఏడాది ఆగష్టు 15న మాత్రమే ఈ అవకాశం కల్పించింది. ఇప్పుడు మరోసారి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. మహిళా దినోత్సవం రోజు బస్సు సౌకర్యం కల్పించడం మాత్రం ఇదే మొదటిసారి.