తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Updated On : February 14, 2019 / 12:10 PM IST

రక్త సంబంధం.. అతని విజ్ఞతను పనిచేయనీకుండా చేసింది. ప్రాణం పోయిందని తెలిసినా ఆ తండ్రి తిరిగొస్తాడని నెలరోజుల పాటు ట్రీట్ మెంట్ కొనసాగించాడు ఆ కొడుకు. పైగా ఇదంతా చేసింది మారుమూల ప్రాంతంలో ఉండే నిరక్షరాస్యుడు కాదు ఐపీఎస్ ఆఫీసర్.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజేంద్ర కుమార్‌ మిశ్రా తండ్రిపై ఉన్న మమకారం ఇంతటి పనిని చేయించింది. 

1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి రాజేంద్ర కుమార్ మిశ్రా తండ్రి కేఎమ్‌ మిశ్రా (84)కు ఊపిరితిత్తుల వ్యాధితో కొంతకాలం బాధపడ్డాడు. 2019 జనవరి 13న సీరియస్ అవడంతో బన్సాల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. జనవరి 14న సాయంత్రం చికిత్సకు స్పందించని మిశ్రాను మృతి చెందినట్లుగా వైద్యులు నిర్థారించారు. మృతదేహాన్ని ‘74 బంగ్లాస్’‌ ప్రాంతానికి తీసుకుపోయాడు ఆ ఐపీఎస్ ఆఫీసర్. అప్పటి నుంచి శవానికి ఆయుర్వేద చికిత్స చేయించడం మొదలుపెట్టాడు. 

మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఉండే ప్రాంతమైనా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరిసరాల్లో ఇబ్బందిగా ఉందని వాసన వస్తుందని ఫిర్యాదు రావడంతో కొద్ది రోజుల కింద ప్రత్యేక ఆర్మీ బలగాల (ఎస్‌ఏఎఫ్‌)కు చెందిన కానిస్టేబుళ్లు ఆ ప్రాంతానికి వచ్చారు. మిశ్రా ఇంటిని గుర్తించి అడిగిన ప్రశ్నకు.. ఆయుర్వేద చికిత్సకు తన తండ్రి స్పందిస్తున్నారని తెలిపారు. తన తండ్రి పరిస్థితిపై ఆస్పత్రి ఇచ్చిన నివేదికపై మాత్రం తాను స్పందించబోనని చెప్పారు. దీంతో ఆయన తండ్రిని చూపించాలని మీడియా కోరింది. అయితే, తన తండ్రిని చూసేందుకు ఆయన మీడియాను అనుమతించలేదు. 

బస్సాల్‌ ఆస్పత్రి ప్రతినిధి లోకేశ్‌ ఝా ఈ విషయంపై మాట్లాడుతూ… ‘కేఎమ్‌ మిశ్రాను జనవరి 13న ఆస్పత్రిలో చేర్పించారు. అశ్విని మల్హోత్రా అనే వైద్యుడు చికిత్స అందిస్తుండగానే జనవరి 14న మృతి చెందారు. మరణ ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చి మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందజేశాం’ అని తేల్చి చెప్పారు.
 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : మనోళ్లకే ఫస్ట్ ప్రైజ్: మంచుతో మహావిష్ణు శిల్పం

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది

Also Read : తెలుగులో కూడా పేటీఎం సేవలు

Also Read : ZOMATO CHAT: అమ్మతోడు సార్.. మీ డబ్బులు వచ్చేస్తాయ్