PM Modi: ఇరాన్ మంత్రితో మోదీ భేటీ

ఓ వైపు మహమ్మద్ ప్రవక్త పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఇరాన్ మంత్రి ఇండియాకు విచ్చేశారు.

PM Modi: ఇరాన్ మంత్రితో మోదీ భేటీ

Pm Modi (1)

Updated On : June 9, 2022 / 9:39 PM IST

PM Modi: ఓ వైపు మహమ్మద్ ప్రవక్త పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఇస్లామిక్ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలో ఇరాన్ మంత్రి ఇండియాకు విచ్చేశారు. గురువారం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాని మోడీ.. ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్‌తో భేటీ అయ్యారు.

విదేశాంగ మంత్రి జయ్ శంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ తదితరులతోనూ చర్చలు నిర్వహించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, డిప్లొమటిక్ రిలేషన్స్, మానవ బంధాల మధ్య సహకారం తదితర అంశాలపై చర్చలు జరిగాయి.

గతేడాదే బాధ్యతలు చేపట్టిన అమీర్ అబ్దుల్లాహేన్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్త పట్ల వ్యతిరేకంగా చేసిన కామెంట్ల పట్ల ఇటువంటి పరిస్థితికి దారితీసిందని అజిత్ దోబల్‌కు తెలియజేశారు. భారత్ మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రికి భారత్ స్పష్టం చేశారు.

Read Also: మోదీ జీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఎన్జీవోనా..?

ఈ అంశం పట్ల మిగిలిన వారికి పాఠంలా ఉండేలా చర్యలు తీసుకుంటామని భారత్ హామీ ఇచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మతాలను పరస్పరం గౌరవించుకోవాలని, విభజనవాద ప్రకటనలను నివారించాలనే అంగీకారానికి వచ్చినట్టు అబ్దుల్లాహేన్ ట్వీట్ చేశారు.

భారత్ అధికారులు నిందితుల పట్ల వ్యవహరిస్తున్న వైఖరిపై ముస్లింలు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. దైవ విశ్వాసాల పట్ల భారత్, భారత ప్రజలు చూపించే గౌరవాన్ని కొనియాడారు. చర్చల అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ ఆసక్తి చూపించింది.