తేజస్​ ఎక్స్​ప్రెస్​ సేవలు నిలిపివేత

  • Published By: venkaiahnaidu ,Published On : November 24, 2020 / 03:49 AM IST
తేజస్​ ఎక్స్​ప్రెస్​ సేవలు నిలిపివేత

Updated On : November 24, 2020 / 7:17 AM IST

IRCTC Halts Tejas Express తేజస్​ ఎక్స్​ప్రెస్​ రైలు సేవలను తాత్కాలికంగా రద్దు చేసింది రైల్వే శాఖ. కరోనా నేపథ్యంలో లఖ్​నవూ-ఢిల్లీ, అహ్మదాబాద్​-ముంబై మధ్య నడిచే తేజస్​ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.




ఐఆర్​సీటీసీ పర్యవేక్షణలో నడిచే ఈ తేజస్​ ఎక్స్​ప్రెస్​ సర్వీసులు.. లాక్​డౌన్​ అనంతరం అక్టోబర్​ 17న తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. మహమ్మారి భయాల నేపథ్యంలో ప్రయాణికులు వీటిపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఫలితంగా.. వ్యయంతో కూడుకున్న ఈ​ ట్రైన్ల నిర్వహణ కష్టంగా మారింది.