Maharashtra Politics: సుప్రియా సూలేనే తదుపరి ఎన్సీపీ అధినేతనా? అజిత్ పవార్‭ను ఎందుకు పక్కన పెట్టారు?

తాజా పదవి సైతం ఆమెను పార్టీలో కీలకం చేసేందుకు ఇచ్చారని అంటున్నారు. అజిత్ పవార్ ప్రాధాన్యం తగ్గించాలంటే సుప్రియాకు ఇప్పటి నుంచే కీలక పదవి ఉండాలని, పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరిగిన అనంతరం అధ్యక్ష పదవికి మార్గం సులువు అవుతుందని శరద్ పవార్ స్ట్రాటజీ అని అంటున్నారు

Maharashtra Politics: సుప్రియా సూలేనే తదుపరి ఎన్సీపీ అధినేతనా? అజిత్ పవార్‭ను ఎందుకు పక్కన పెట్టారు?

Updated On : June 10, 2023 / 9:07 PM IST

Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‭లను నియమిస్తున్నట్లు ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. పార్టీలో ఎప్పటి నుంచో కీలకంగా ఉన్న అజిత్ పవార్‭కు కొత్త మార్పుల్లో ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. తన కుమార్తె అయిన సుప్రియా సూలేకు అవకాశం కల్పించిన శరద్ పవార్.. కావాలనే అజిత్ పవార్‭ను పక్కన పెట్టారనే విమర్శలు అప్పుడే ఊపందుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.

Umar Khalid: జేఎన్‭యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ జైలుకు వెళ్లి 1,000 రోజులు పూర్తి

కొద్ది రోజుల క్రితం పార్టీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా చేశారు. అనంతరం పార్టీకి కాబోయే అధ్యక్షులు ఎవరనే అంశంపై కసరత్తు ప్రారంభమవుతుందని ఆయనే స్వయంగా తెలిపారు. అయితే రేసులోకి అజిత్ పవార్, సుప్రియా సూలే పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఒకానొక సమయంలో అజిత్ పవార్ చాలా డామినేటెడ్‭గా ముందుకు కదిలారు. పవార్ తర్వాతి తానే పార్టీ అధినేతననే స్థాయిలో ఆయన ప్రవర్తించారు. కానీ అంతలోనే పవార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

Karnataka: ఉచిత బస్సు ప్రయాణం 20 కిలోమీటర్లేనట.. ముహూర్తం ముందు అసలు విషయం చెప్పిన కర్ణాటక సర్కార్

దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. కానీ అజిత్ పవార్ నుంచి మాత్రం పెద్దగా స్పందన రాలేదు. అంతకు ముందు సైతం పవార్ రాజీనామాపై పార్టీ నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తే అజిత్ పవార్ మాత్రం.. తదుపరి అధ్యక్షుడిపై చర్చ చేశారు. ఈ పరిణామాల్ని బట్టి చూస్తుంటే.. అజిత్ పవార్ దూకుడు తగ్గించేందుకే పవార్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. వాస్తవానికి తన కూతురుని అధ్యక్ష పదవిలోకి తీసుకువచ్చేందుకు పవార్ రాజీనామా చేశారని, అయితే అజిత్ అడ్డురావడంతో ఆ ప్రయత్నాల్ని విరమించుకున్నారని విమర్శకులు అంటున్నారు.

Omar Abdullah: కేజ్రీవాల్ అప్పుడు మాకు మద్దతు తెలపలేదు.. ఇప్పుడు మాత్రం మా మద్దతు మీకు కావాలా?

ఇక తాజా పదవి సైతం ఆమెను పార్టీలో కీలకం చేసేందుకు ఇచ్చారని అంటున్నారు. అజిత్ పవార్ ప్రాధాన్యం తగ్గించాలంటే సుప్రియాకు ఇప్పటి నుంచే కీలక పదవి ఉండాలని, పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరిగిన అనంతరం అధ్యక్ష పదవికి మార్గం సులువు అవుతుందని శరద్ పవార్ స్ట్రాటజీ అని అంటున్నారు. అంతకు ముందు తాను ముఖ్యమంత్రి అవుతానని, వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడలేనని అజిత్ పవార్ అన్నారు. దానిపై శరద్ పవార్ పెద్దగా స్పందించలేదు. కానీ అజిత్‭ను ఆ విషయమై మందలించినట్లు సమాచారం.

Bengal panchayat polls: పంచాయతీ ఎన్నికలనూ వదలని అల్లర్లు.. బెంగాల్‭లో ఇది ఆనవాయితీగా మారిందా?

ఇక పార్టీలో చేపట్టిన మార్పులు చేర్పుల్లో అజిత్ పవార్‌కు బాధ్యతలు అప్పగించకపోవడంపై శరద్ పవార్ తాజాగా వివరణ ఇచ్చారు. అజిత్ పవార్ ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్‌సీపీ విపక్ష నేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌కు కీలక బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం పట్ల అజిత్ పవార్ సంతోషంగా ఉన్నారా అని అడిగినప్పుడు, కలిసే నిర్ణయం తీసుకున్నామని, డెషిషన్ మేకర్స్‌లో అజిత్ పవార్ కూడా ఉన్నారని పవార్ తెలిపారు. ఏది ఏమైనా.. రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టని పవార్ ఎత్తుగడలు ఏ విధమైనవో చెప్పడం కష్టమే.