H3N2 Influenza Virus : మళ్లీ మాస్క్ తప్పదా? కరోనా కంటే వేగంగా వ్యాపిస్తూ భయపెడుతున్న కొత్త వైరస్, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటీ ఇన్ ఫ్లూయెంజా వైరస్? దానికి కరోనాకు సంబంధం ఉందా? మరో భారీ ప్రమాదం పొంచి ఉందా? మూతికి మళ్లీ కచ్చితంగా మాస్క్ తగిలించుకోవాల్సిన పరిస్థితులు తయారయ్యాయా? కొత్త వైరస్ జనాల్లో రేపుతున్న అలజడి ఏంటి? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

H3N2 Influenza Virus : మళ్లీ మాస్క్ తప్పదా? కరోనా కంటే వేగంగా వ్యాపిస్తూ భయపెడుతున్న కొత్త వైరస్, డాక్టర్లు ఏం చెబుతున్నారు?

H3N2 Influenza Virus : కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటీ ఇన్ ఫ్లూయెంజా వైరస్? దానికి కరోనాకు సంబంధం ఉందా? మరో భారీ ప్రమాదం పొంచి ఉందా? మూతికి మళ్లీ కచ్చితంగా మాస్క్ తగిలించుకోవాల్సిన పరిస్థితులు తయారయ్యాయా? కొత్త వైరస్ జనాల్లో రేపుతున్న అలజడి ఏంటి? డాక్టర్లు ఏం చెబుతున్నారు?

కొత్త వైరస్.. దేశాన్ని వణికిస్తోంది. వదలని దగ్గు, విడవని జలుబు.. కరోనా కంటే వేగంగా వ్యాపిస్తున్న వైరస్.. మరో ముప్పు ముంచుకు రాబోతోందా? ఏంటీ H3N2? అంత ప్రమాదకరమా? మాస్క్ తప్పని పరిస్థితులు మళ్లీ వచ్చాయా? దేశంలో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు.

కరోనా నుంచి బయటపడి హమ్మయ్య అనుకుంటున్న సమయంలో కొత్త వైరస్ జనాలను వణికిస్తోంది. దేశంలో ప్రమాదకర స్థాయిలో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇది సాధారణ ఫ్లూయే అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా స్థాయిలో ప్రమాదకరం కాకపోయినా హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. పండుగల సీజన్ వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.(H3N2 Influenza Virus)

Also Read..H3N2 virus : దేశంలో భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలేంటో తెలుసా?

చలి కాలం నుంచి వేసవిలోకి ఎంటర్ అవుతున్నాం. మామూలుగా మార్చి మధ్యలో ఎండలు పెరుగుతాయి. అయితే, ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ గా కనిపిస్తోంది. ఫిబ్రవరి నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పొద్దంతా ఎండ, రాత్రయితే చలి. వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వేసవి ప్రవేశిస్తున్న సమయంలో దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవర పెడుతోంది. కరోనా తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు ఇన్ ఫ్లూయెంజా A ఉపరకం H3N2 వైరస్ ప్రధాన కారణం అని ఐసీఎంఆర్ ఇప్పటికే గుర్తించింది. ప్రాణాంతకం కాకపోయినా ఈజీగా తీసుకునే పరిస్థితి లేదని, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

H3N2 వైరస్ కారణంగా శ్వాస కోశ వైరల్ ఇన్ ఫెక్షన్ వస్తోంది. నిజానికి ఈ వైరస్ 1968లోనే మనుషుల్లో బయటపడింది. H3N2 అనేది.. ఇన్ ఫ్లూయెంజా A వైరస్ యొక్క రెండు ప్రోటీన్ జాతుల కలయిక. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ల నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, చలి, గొంతులో గరగర, ముక్కు కారడం, అలసటి, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలు.

కరోనా తరహాలోనే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతా వారికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి. ఒకవేళ కేవలం జలుబు, దగ్గు ఉంటే.. మొదటి రెండు మూడు రోజులు వేచి చూడొచ్చు. జ్వరం, విరేచనాలు మొదలైతే మాత్రం వెంటనే డాక్టర్ ను కలవాలని నిపుణులు సూచిస్తున్నారు.(H3N2 Influenza Virus)

Also Read..Adenovirus Cases: పశ్చిమ బెంగాల్‌లో విజృంభిస్తున్న ప్రమాదకర వైరస్.. పిల్లలు జాగ్రత్త అంటున్న ప్రభుత్వం

దేశవ్యాప్తంగా జ్వరం, ఫ్లూ కేసుల పెరుగుదల కనిపిస్తోంది. రెండు మూడు నెలలుగా ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కరోనాకు, ఇన్ ఫ్లూయెంజా వైరస్ కు సంబంధం ఉందా? అనే భయాలు జనాల్లో వినిపిస్తున్నాయి. అయితే, రెండూ ఒకే రకమైన లక్షణాలు కలిగున్నాయని, రెండు వైరస్ ల ప్రభావం రెండు మూడు నెలలు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్ ఫ్లూయెంజా శాంపిల్స్ ను కూడా కోవిడ్ పరీక్షలకు తరలిస్తున్నారు.

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం అని అనుకుంటున్న సమయంలో కొత్త వైరస్ ఇప్పుడు మరింత టెన్షన్ పెడుతోంది. హైదరాబాద్ లో జ్వరాల కేసులు భారీగా పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇన్ ఫ్లూయెంజా వైరస్ ప్రాణాంతకం కాదని, శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవారు మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. అదే సమయంలో వైరస్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Also Read..Brain Eating Amoeba : మెదడును తినేసే అమీబా..! మరో వ్యక్తి మృతి..ప్రపంచానికి మరో కొత్త వైరస్ ఆందోళన

రెండేళ్ల పాటు కరోనా పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మాస్క్ లేకుండా బయటకు రావడం అంటే ప్రాణాలను గాల్లో కలిపేందుకు సిద్ధంగా ఉండటమే అన్న స్థాయిలో వైరస్ విజృంభించింది. కోట్లలో కేసులు, లక్షల్లో మరణాలు.. వేల టన్నుల భయాలు.. కరోనా మిగిల్చిన శోకం, భయం అంతా ఇంతా కాదు. మహమ్మారి మిగిల్చిన భయాల నుంచి మనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మాస్క్ లేకుండా ధైర్యంగా జనాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇన్ ఫ్లూయెంజా వైరస్ భయపెడుతోంది. దీని కారణంగా మళ్లీ మాస్క్ మ్యాండేటరీ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాస్క్ మళ్లీ కచ్చితంగా మూతికి తగిలించుకోవాల్సిన రోజులు వచ్చేశాయని డాక్టర్లు అంటున్నారు.