Chandrayaan-3 Mission : చారిత్రాత్మక ఘట్టానికి మరింత చేరువైన చంద్రయాన్-3.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందంటే ..

వచ్చే కొద్దిరోజుల్లో చంద్రయాన్ -3 చంద్రుడి చుట్టూ అనేక దశలను పూర్తి చేసుకుంటుంది. చంద్రుడికి సమీపంలోని బింధువు వద్ద ఉన్నప్పుడు 120 కిలో మీటర్లు, సుదూర బిందువులో ఉన్నప్పుడు 18వేల కిలోమీటర్లుగా ఉంటుంది.

Chandrayaan-3 Mission : చారిత్రాత్మక ఘట్టానికి మరింత చేరువైన చంద్రయాన్-3.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందంటే ..

Chandrayaan-3 Mission

Updated On : August 6, 2023 / 7:43 AM IST

Chandrayaan-3 : ఇస్రో (ISRO) ఘన విజయం సాధించింది. చంద్రుడు‌పై కాలుమోపడమే లక్ష్యంగా రోదసిలో పయనిస్తున్న భారత వ్యోమనౌక చంద్రయాన్ -3 (Chandrayaan-3) తన ప్రస్థానంలో మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. శనివారం సాయంత్రం సమయంలో చంద్రుడి కక్ష్య (Moon orbit) లోకి ప్రవేశించింది. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతున్న చంద్రయాన్-3.. చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ నెల 23న ఈ ప్రక్రియ పూర్తిచేసుకుంటుందని ఇస్రో తెలిపింది.

Chandrayaan-3: విజయవంతంగా దూసుకెళ్తున్న చంద్రయాన్ -3.. అసలు టార్గెట్ ఇప్పుడు మొదలైంది ..

ప్రయోగాన్ని ఎప్పుడు ప్రారంభించారు..

చంద్రయాన్-3 గతనెల 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా ఇస్రో భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అది భూమి చుట్టూ దశలవారిగా కక్ష్యను పెంచుకొని ఈనెల 1న చంద్రుడిని చేరే లూనార్ ట్రాన్స్‌ఫర్ ట్రాజెక్టరీలోకి ప్రవేశించింది. ఈ మార్గంలో ప్రయాణిస్తూ శనివారం సాయంత్రం 7గంటల సమయంలో చంద్రుడికి అత్యంత దగ్గరగా ఉండే బింధువు (పెరిలూన్)లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో బెంగళూరులోని ఇస్రో మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (మాక్స్), టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ (ఇస్ట్రాక్) శాస్త్రవేత్తలు చంద్రయాన్-3కి ఆదేశాలు పంపి దాని వేగాన్ని తగ్గించారు. ఈ ప్రక్రియను లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ అని పిలుస్తారు.  భూమితో పోలిస్తే చంద్రుడి ద్రవ్యరాశి ఆరోవంతు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన చంద్రుడి ఉపరితలం నుంచి 62,630 కిలో మీటర్ల దూరం వరకూ దాని ప్రభావం విస్తరించి ఉంటుంది. ఈ ప్రదేశంలో భూ గురుత్వాకర్షణ శక్తి కన్నా జాబిల్లి గురుత్వాకర్షణ శక్తే అధికం.

Chandrayaan-3 Launch: నింగిలోకి దూసుకెళ్తున్న చంద్రయాన్-3ని విమానంలోనుంచి చూశారా..? వీడియో వైరల్

ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే?

– చంద్రయాన్-3 ఇప్పుడు నుంచి చంద్రుని చుట్టూ ఐదు కక్ష్యల్లో మార్చబడుతుంది. చంద్రుడికి సమీపంలోని బిందువు వద్ద ఉన్నప్పుడు 120 కిలోమీటర్లు, సుదూర బిందువులో ఉన్నప్పుడు 18వేల కిలోమీటర్లుగా ఉంటుంది.
– ఆగస్టు 6వ తేదీ రాత్రి 11గంటలకు చంద్రయాన్-3 కక్ష్యను 10 నుంచి 13వేల కిలో మీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
– ఆగస్టు 9న మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు వేల కిలో మీటర్ల కక్ష్యలోకి మార్చుతారు.
– ఆగస్టు 14న మధ్యాహ్నం వెయ్యి కిలో మీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేర్చుతారు.
– వెయ్యి కిలో మీటర్ల వృత్తాకార కక్ష్యలోకి చేరాక వ్యోమనౌకలోని వివిధ వ్యవస్థల పనితీరును ఇస్రో ఒకసారి పరిశీలిస్తుంది. అంతా సవ్యంగా ఉందనుకున్నాక తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తుంది.
– ఆగస్టు 17న వ్యోమనౌకలోని ఆర్బిటర్ – రోవర్ మాడ్యూల్‌కు ఆదేశాన్ని పంపుతుంది. ఫలితంగా అది ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి విడిపోయి, సొంతంగా చందమామను చుట్టేస్తుంది.
– ఈనెల 23 సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ – రోవర్ చంద్రుడిపై ల్యాండింగ్‌ ప్రక్రియ జరుగుతుంది.
– గతంలో పలు దేశాలు, అంతరిక్ష సంస్థలు తమ రాకెట్లను నేరుగా చంద్రుడివైపుకు అంతరిక్షనౌకలను పంపించి లక్ష్య ఛేదనలో విఫలమయ్యాయి. కానీ, ఇస్రో ఎంచుకున్న మార్గం, పద్దతిలో విఫలమయ్యే అవకాశం చాలా తక్కువ. చంద్రయాన్-3 మిషన్ లక్ష్యాన్ని పూర్తిచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.