గగన్ యాన్ కి డేట్ ఫిక్స్.. అంతరిక్షంలోకి మహిళ
డిసెంబర్ 2021ని గగన్ యాన్ కి టార్గెట్ గా పెట్టుకొన్నట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) డిక్లేర్ చేసింది. అంరిక్షంలోకి మనుషులను పంపనున్న మొట్టమొదటి మిషన్ గా గగనయాన్ రికార్డు సృష్టించనుంది. ఈ మేరకు శుక్రవారం(జనవరి11,2019) ఇస్రో చీఫ్ కే.శివన్ ప్రకటించారు. భారతదేశపు స్పేస్ ఏజెన్సీకి గగనయాన్ ఓ పెద్ద టర్నింగ్ పాయింట్ అని శివన్ తెలిపారు. ఈ మిషన్ కోసం తగిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 2020, జులై 2021 లలో రెండు మానవ రహిత మిషన్లను అంతరిక్షంలోకి పంపించడం భారత లక్ష్య్యమని ఆయన తెలిపారు.
గగన్ యాన్ కొరకు ప్రారంభ శిక్షణ భారత్ లోనే పూర్తి అవుతుందని, అడ్వాన్స్ డ్ ట్రైయినింగ్ రష్యాలో ుండవచ్చని ఆయన తెలిపారు. అంతరిక్షంలోకి వెళ్లే టీమ్ లో మహిళా వ్యోమగాములు(ఆస్ట్రోనాట్స్) కూడా ఉన్నారని ఆయన చెప్పారు. గగన్ యాన్ మిషన్ 2022 నాటికి పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ ఇచ్చినట్లు గతంలో శివన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ టార్గెట్ కంటే ముందుగానే గగన్ యాన్ ని మిషన్ కంప్లీట్ చేయనున్నట్లు శుక్రవారం శివన్ ప్రకటించారు. క్రూ మాడ్యూల్, ఎస్కేప్ సిస్టమ్స్ వంటి చాలా టెక్నీలజీలను ఇప్పటికే కంప్లీట్ చేసినట్లు శివన్ తెలిపారు.
గతేడాది డిసెంబర్ లో ఈ దేశీయ మానవ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మిషన్ ద్వారా ముగ్గురు వ్యక్తులు ఏడు రోజుల పాటు అంతరిక్షంలో గడుపనున్నారు. 10వేల కోట్ల రూపాయలతో ఈ మిషన్ రెడీ అవుతోంది.
ద్ర కేబినెట్