ఇట్స్ మై డ్యూటీ : 8 నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నఎమ్మెల్యే

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 09:23 AM IST
ఇట్స్ మై డ్యూటీ : 8 నెలల గర్భంతో అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నఎమ్మెల్యే

Updated On : February 29, 2020 / 9:23 AM IST

మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఓ మహిళా డాక్టర్ సలహాలు తీసుకుంటూ హాజరవుతున్నారు. అదేంటీ అసెంబ్లీ సమావేశాలకు..డాక్టర్ సలహాలకు సంబంధమేంటి అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ఎమ్మెల్యే 8 నెలల గర్భణి. ఆమె పేరు నమితా ముందాడ. వయస్సు 30. 

బీడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నమితా ముందాడ వివాహం అయ్యాక మొదటిసారి గర్భం దాల్చానే. ఇప్పుడామెకు 8 నెలలు. ఆమె గర్భిణి అని గమనించిన మీడియా ‘‘ఇటువంటి పరిస్థితుల్లో మీరు సమావేశాలకు వస్తున్నారు…ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమీ లేదా? అని ప్రశ్నించింది. 

దీనికి సమాధానంగా నమితా మాట్లాడుతూ..గర్భవతిని అయినా ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లటం నా బాధ్యత. అందుకే నా ప్రజలు నాకు ఓట్లు వేశారు అని..బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడం ఎమ్మెల్యేగా నా బాధ్యత అని తెలిపారు.

గర్భవతిగా తాను డాక్టరు సలహాలను పాటిస్తూనే ప్రజల కోసం అసెంబ్లీ సమావేశానికి వచ్చానని నమిత చెప్పారు. గర్భిణీగా అందరికీ ఉన్నట్లుగా తనకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని అలాగని ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావటం కూడా నా బాధ్యతగా భావిస్తున్నానని నమితా తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నమిత బీజేపీలో చేరి బీడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 

కాగా..అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తొలి గర్భిణీ ఎమ్మెల్యేను తానే అని కొంతమంది అంటుండగా విన్నానని నమితా ముందాడ నవ్వుతూ తెలిపారు.