Amarnath Yatra: 62 రోజులపాటు అమర్‌నాథ్ యాత్ర.. ప్రారంభం, పేర్లు నమోదు తేదీలు ప్రకటన?

అమర్ నాథ్ యాత్ర ప్రారంభ తేదీని జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా ప్రకటించారు. 62 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.

Amarnath Yatra: 62 రోజులపాటు అమర్‌నాథ్ యాత్ర.. ప్రారంభం, పేర్లు నమోదు తేదీలు ప్రకటన?

Amarnath Yatra

Updated On : April 15, 2023 / 7:22 AM IST

Amarnath Yatra: దక్షిణ కశ్మీర్‌ (South Kashmir) లోని హిమాలయాల (Himalayas) లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న పవిత్ర అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర (Amarnath shrine) వార్షిక యాత్ర ప్రారంభ తేదీ వెల్లడైంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  (Lieutenant Governor Manoj Sinha) అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra) ప్రారంభ తేదీ, యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జులై 1 నుంచి యాత్ర మొదలై ఆగస్టు 31 వరకు కొనసాగుతోందని తెలిపారు. మనోజ్ సిన్హా అధ్యక్షతన శ్రీ అమరనాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (Shri Amarnathji Shrine Board) 44వ సమావేశంలో యాత్ర షెడ్యూలును ప్రకటించారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా, యాత్ర సాఫీగా సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Amarnath Yatra: నేటి నుంచే అమర్‌నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం

62రోజుల పాటు జరిగే యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తికలిగిన వారు ఈ నెల 17 నుంచి ఆఫ్ లైన్, ఆన్‌లైన్ విధానాల్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే, ఈ యాత్ర రెండు దారుల్లోనూ ఒకే సారి ప్రారంభమవుతుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్ బల్ జిల్లాలోని బల్తాల్ ప్రాంతాల నుంచి యాత్ర ప్రారంభమవుతుందని మనోజ్ సిన్హా తెలిపారు. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకోసం ఉదయం, సాయంత్రం హారతి (ప్రార్థనలు) ప్రత్యక్షప్రసారాన్ని కూడా అనుమతిస్తుంది.

Mallikarjun Kharge : 100 ఫీట్ల విగ్రహాలు పెట్టడం కాదు దళితులు, పేదలకు ఏం చేశారో చెప్పాలి‌-ఖర్గే

యాత్రికులకు వైద్య సేవలు, టెలికాం సదుపాయాలు అందుబాటులోకి తేనున్నారు. అదేవిధంగా వసతి, విద్యుత్, నీటి సౌకర్యం, భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన సౌకర్యాలను యాత్రికులకు అందుబాటులో ఉంచేందుకు పలు విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని మనోజ్ సిన్హా చెప్పారు. యాత్ర సందర్భంగా స్థానిక వాతావరణ పరిస్థితుల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి గూగుల్ ప్లే స్టోర్ లో శ్రీ అమర్‌నాథ్‌జీ యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.