Jammu Kashmir : శ్రీనగర్​లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు

జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్​బాగ్​లోని వాణిజ్య భవనంలో గురువారం (జనవరి 27) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Jammu Kashmir : శ్రీనగర్​లో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో స్థానికులు

Fire Breaks Out At Commerci

Updated On : January 27, 2022 / 3:38 PM IST

Jammu Kashmir : జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్​బాగ్​లోని వాణిజ్య భవనంలో గురువారం (జనవరి 27) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ భవనంలోని స్థానికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారులు.. ఫైరింజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ భవనంలోని సిలిండర్​ పేలడంతోనే ఈ ఘటన జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో మంటలను అదుపుచేస్తుండగా ఒక ఫైర్​ అధికారి గాయపడినట్లు సమాచారం.

ఈ భారీ అగ్నిప్రమాద ఘటనలో ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కమర్షియల్ భవనంలో అనేక కంపెనీల ఆఫీసులు ఉన్నాయి. ఘటన స్థలంలో దాదాపు నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పుతున్నాయి. అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.

Read Also : Delhi : ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలు సడలింపు.. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత