National Swimming Pool Day 2023 : హాయిగా స్విమ్ చేయండి.. ఒత్తిడి, ఆందోళన మర్చిపోండి

ఈత కొట్టడం అంటే అందరికీ భలే సరదా.. చాలామంది స్విమ్మింగ్ పూల్‌లో ఆసనాలు కూడా వేస్తుంటారు. ఈత వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందట. మనసు తేలికగా ఉంటుందట. జూలై 11 నేషనల్ స్విమ్మింగ్ పూల్ డే.

National Swimming Pool Day 2023 : హాయిగా స్విమ్ చేయండి.. ఒత్తిడి, ఆందోళన మర్చిపోండి

National Swimming Pool Day 2023

National Swimming Pool Day 2023 : స్విమ్ చేయడానికి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి స్విమ్మింగ్ పూల్స్, కొలనుల్లో, బీచ్‌లలో ఈతలు కొడుతుంటారు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇది సరైన మార్గం. జూలై 11 ‘నేషనల్ స్విమ్మింగ్ పూల్ డే’.

National swimming Day 2023 : స్విమ్మింగ్ పూల్‌లో జలాసనం వేసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

ఈత కొలనులు, ఈత కొట్టడం అనేది ఇప్పటిది కాదు.. రోమన్ల కాలంలోనే అంటే 600 BC లో ఈత కొలనులు ఉండేవట. 4వ శతాబ్దపు శ్రీలంకలో ప్రత్యేక స్క్రోల్ డిజైన్, మెట్ల ప్లైట్లతో స్విమ్మింగ్ పూల్స్ కట్టారట. గ్రీకులు, రోమన్లు అథ్లెటిక్స్ కోసం వీటిని వాడేవారట. రోమన్ చక్రవర్తులు తమ ఈత కొలనులను చేపలతో నిల్వ చేసే ఉంచేవారట. మొదటి శతాబ్దం BC‌లో మొదటి వేడి చేసిన ఈత కొలను నిర్మించారట.

 

అయితే మొట్టమొదటి ఇండోర్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ 1742 లో లండన్‌లో ప్రారంభించారు. బాగినో అని పిలవబడే ఈ స్విమ్మింగ్ పూల్‌లో ఒక గినియా చెల్లించగలిగే మగవారి కోసమే తెరిచేవారట. మహిళలకు అస్సలు అనుమతి ఉండేది కాదట. 1896 నుంచి ఒలింపిక్ క్రీడలు మొదలైనపుడు స్విమ్మింగ్ రేసులు మొదలయ్యాయి. ఇవి ప్రపంచ వ్యాప్తంగా స్విమ్మింగ్ పూల్‌లు ప్రజాదరణ పొందడంలో తోడ్పడ్డాయి. నేషనల్ స్విమ్మింగ్ పూల్ డే 2016 లో మొదటిసారి ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అందరూ కలిసి ఒక చోట సరదాగా గేదర్ అవుతారు కాబట్టి సరదాలు, సంతోషాలు పంచుకోవడానికి ఇదో మంచి మార్గం.

Swimming Record : 8గంటల పాటు ఈత కొట్టి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ నమోదు చేసిన 15 ఏళ్ల అమ్మాయి..

జాతీయ స్విమ్మింగ్ పూల్ డేని ఎలా జరుపుకోవాలి అంటే  ఈత వచ్చినట్లైతే ఈత కొడుతూ చల్లటి నీటిని ఆస్వాదించవచ్చు. బీచ్‌కు దగ్గర ప్రాంతంలో ఉన్నవారైతే మరీ మంచిది. బీచ్‌లో ఈత కొట్టడం బెస్ట్ వే. లేదంటే వాటర్ పార్కులో గడపొచ్చు. పూల్ పార్టీని హోస్ట్ చేసుకోచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య పాటలు వింటూ పూల్‌లో విశ్రాంతి తీసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఈత కొట్టడం వల్ల ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో ఇది ఎంతో సహాయపడుతుందట. ఇక లేటెందుకు? ఈరోజంతా పూల్ పార్టీ సెలబ్రేట్ చేసుకోండి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందండి.