Sanjal with Jeff Bezos: నాసా రిజెక్ట్ చేసిన భారత మహిళ సంజల్.. జెఫ్ బెజోస్ స్పేస్ రాకెట్‌లో కీలకంగా
సంజల్ గవాందె మహారాష్ట్రకు చెందిన 30ఏళ్ల మహిళ. బిలియనీర్ జెఫ్ బెజోస్ కలల ప్రాజెక్ట్ బ్లూ ఆరిజన్ సబ్ ఆర్బిటల్ స్పేస్ రాకెట్ న్యూ షెఫార్డ్ ఇంజినీర్ల టీంలో ఒకరయ్యారు.

Sanjal Gavande Jeff Bezos
Sanjal with Jeff Bezos: సంజల్ గవాందె మహారాష్ట్రకు చెందిన 30ఏళ్ల మహిళ. బిలియనీర్ జెఫ్ బెజోస్ కలల ప్రాజెక్ట్ బ్లూ ఆరిజన్ సబ్ ఆర్బిటల్ స్పేస్ రాకెట్ న్యూ షెఫార్డ్ ఇంజినీర్ల టీంలో ఒకరయ్యారు. కమర్షియల్ స్పేస్‌ఫ్లైట్ కంపెనీలో సిస్టమ్ ఇంజినీర్ అయిన సంజల్ గవందె ముంబై యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాస్టర్స్ పూర్తి చేయడానికి 2011లో యూఎస్ వెళ్లి మిచిగాన్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు.
‘నా చిన్ననాటి కల నిజమవుతుండటంతో చాలా సంతోషంగా ఉంది. బ్లూ ఆరిజన్ టీంలో ఒకరవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా’ అని గవాందె అన్నారు.
సంజల్ గవాందె.. మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి, ఎమ్టీఎన్ఎల్ మాజీ అధికారి కూతురు. మాస్టర్స్ కోర్సులో ఏరోస్పేస్ ను సబ్జెక్ట్ గా తీసుకుని ఫస్ట్ క్లాస్ సాధించారు. ‘తానెప్పుడూ స్పేస్‌షిప్‌లో భాగం కావాలని కోరుకునేది. అందుకే మిచిగాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివేటప్పుడు ఎంచుకుంది’ అని అశోక్ గవాందె అన్నారు.
చదువుకున్న తర్వాత.. మెర్క్యూరీ మెరైన్ లో బ్రూన్‌విక్ కార్పొరేషన్‌కు చెందిన మెరైన్ ఇంజిన్ డివిజన్ లో పనిచేస్తున్నారు. మూడేళ్ల పాటు అక్కడ డిజైన్ అనాలసిస్ ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె డిజైన్ అనాలసిస్ ఇంజినీర్ అయ్యారు. ఆ తర్వాత టయోటా రేసింగ్ డెవలప్మెంట్ లో మెకానికల్ డిజైన్ ఇంజినీర్ గా జాయిన్ అయ్యారు.
సంజల్ గవాందెకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. అది కూడా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)కు అప్లై చేయడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాకపోతే సిటిజిన్‌షిప్ ఇష్యూస్ కారణంగా సెలక్ట్ కాలేకపోయారు.
‘తను ఒక మహిళ. మెకానికల్ ఇంజినీరింగ్ ఎందుకు తీసుకుందని అనే వారు. నేను కూడా కొన్ని సార్లు తాను హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందేమో.. చేయగలదా అనే అనుమానం పడేదాన్ని. మేమంతా గర్వపడేలా చేసింది. ఏరోస్పేస్ రాకెట్స్ చేయాలని కల కనింది.. ఎట్టకేలకు సాధించింది’ అని ఆమె తల్లి అన్నారు.