కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ.. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం చేదు అనుభవం ఎదురైంది.

కంగనా రనౌత్‌కు చెంపదెబ్బ.. చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం

Updated On : June 6, 2024 / 7:32 PM IST

Kangana Ranaut Slapped By woman constable: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌కు చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం చేదు అనుభవం ఎదురైంది. ఆమెను కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఢిల్లీకి వెళ్లే సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా తనిఖీల అనంతరం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. రైతుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలపై కంగనాతో కుల్విందర్ కౌర్ వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.

“100 రూపాయల కోసం ఆందోళనలో రైతులు కూర్చున్నారని ఆమె(కంగనా రనౌత్‌) స్టేట్‌మెంట్ ఇచ్చింది. వెళ్లి కూర్చుంటావా? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ రైతుల కోసం అక్కడే కూర్చుని నిరసన తెలుపుతోంద”ని కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ అన్నారు. కాగా, తనకు జరిగిన అవమానంపై ఢిల్లీలోని సీఐఎస్‌ఎఫ్ జనరల్, ఇతర ఉన్నతాధికారులకు కంగనా ఫిర్యాదు చేశారు.

మహిళా కానిస్టేబుల్‌ సస్పెన్షన్
కంగనా రనౌత్‌పై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం సీనియర్ అధికారులతో ప్రత్యేక టీమును సీఐఎస్‌ఎఫ్ నియమించింది. విచారణ కోసం కుల్విందర్ కౌర్‌నుఅదుపులోకి తీసుకుని సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఆఫీసుకు తరలించారు. ఈ ఉదంతంపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కుల్విందర్ కౌర్‌ను కొంతమంది ప్రశంసిస్తుంటే.. మరికొందరు ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మహారాష్ట్ర బీజేపీలో ముసలం.. డిప్యూటీ సీఎం పదవికి ఫడ్నవీస్‌ రాజీనామా

నేను క్షేమంగా ఉన్నాను: కంగనా రనౌత్‌
ఈ ఘటనపై కంగనా స్పందిస్తూ.. ‘‘నేను క్షేమంగా ఉన్నాను. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చెకింగ్‌ పూర్తయిన తర్వాత సీఐఎస్‌ఎఫ్‌లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌ నన్ను దూషిస్తూ ముఖంపై కొట్టింది. ఎందుకు కొట్టావని ఆమెను నేను అడిగాను. రైతుల ఆందోళన గురించి ఆమె అని చెప్పింది. పంజాబ్‌లో తీవ్రవాదం పెరగడం నాకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని ఎలా ఎదుర్కొవాలని ప్రశ్నించారు.