Hijab Row: అఫ్ఘానిస్తాన్‌ వెళ్లి బురఖా లేకుండా దమ్ము చూపించండి – కంగనా రనౌత్

వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. కర్ణాటకలో కొద్ది రోజులుగా నడుస్తున్న హిజాబ్ కాంట్రవర్సీపై ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్పాండ్ అయ్యారు.

Hijab Row: అఫ్ఘానిస్తాన్‌ వెళ్లి బురఖా లేకుండా దమ్ము చూపించండి – కంగనా రనౌత్

Kangana

Updated On : February 11, 2022 / 6:24 AM IST

Hijab Row: వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. కర్ణాటకలో కొద్ది రోజులుగా నడుస్తున్న హిజాబ్ కాంట్రవర్సీపై ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్పాండ్ అయ్యారు. రచయిత Anand Ranganathan చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి దానిపై ‘మీకు ధైర్యం చూపించాలని ఉంటే అఫ్ఘానిస్తాన్ కు వెళ్లి బురఖా లేకుండా ఉండండి. స్వేచ్ఛంగా ఉండండి. మిమ్మల్ని మీరు బంధించుకోకండి’ అంటూ పోస్టు పెట్టారు కంగనా.

స్కూల్స్ లో హిజాబ్ నిషేదించడంపై ఆనంద్ రంగనాథన్ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన పోస్టులో ‘ఇరాన్ 1973లో అని బికినీ వేసుకున్న అమ్మాయిల ఫొటోలు… ప్రస్తుతం బుర్ఖాలు వేసుకున్న ఫొటోలతో.. చరిత్ర నుంచి తెలుసుకోలేని వాళ్లు దానిని రిపీట్ చేయాలనుకుంటున్నారు’ అని పోస్టు చేశారు.

ఉడుపిలోని గవర్నమెంట్ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక హైకోర్టు వరకూ చేరింది. శాంతి, సామరస్యంతో ఉండాలంటూ సీఎం సైతం మూడు రోజుల పాటు విద్యా సంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో మతపరమైన దుస్తులను తీర్పు వచ్చేంత వరకూ ధరించకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది.

Read Also: రిషబ్ పంత్ ఓపెన్ చేయడంపై రోహిత్ శర్మ బడా ప్లాన్