Karnataka Election Results 2023: 136 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. ఇక మిగతా పార్టీలు.. Live Updates
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది.

Karnataka Election Result 2023
Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. పూర్తిస్థాయి మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మేజిక్ ఫిగర్ కంటే ఆ పార్టీకి 23 సీట్లు ఎక్కువ వచ్చాయి.
LIVE NEWS & UPDATES
-
ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 65 సీట్లకే పరిమితం అయింది. జేడీఎస్ 19 సీట్లు, కల్యాణ రాజ్య ప్రగతి పక్షం పార్టీ, సర్వోదయ కర్ణాటక పక్షం పార్టీ ఒక్కో సీటు చొప్పున గెలుచుకున్నాయి. అలాగే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 113 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కాంగ్రెస్ కి అంతకంటే 23 సీట్లు ఎక్కువ వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నందిని బ్రాండ్ స్వీట్లను తమ నేతలకు పంచారు. కర్ణాటక ఎన్నికల్లో అమూల్ Vs నందిని బ్రాండ్ల విషయంలో మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే.
#WATCH | Congress national president Mallikarjun Kharge distributes 'Nandini' brand sweets to party leaders as the party celebrates its victory in the #KarnatakaPolls pic.twitter.com/DkQaPuL22q
— ANI (@ANI) May 13, 2023
-
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై..
ఎన్నికల్లో గెలవడంతో బెంగళూరులో రేపు సాయంత్రం 5.30 గంటలకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై కొత్త ఎమ్మెల్యేలు చర్చించనున్నారు.
-
కాంగ్రెస్ 132 సీట్లు.. మరో నాలుగింటిలో
Karnataka Elections Result
-
కాంగ్రెస్ పార్టీకి అభినందనలు: ప్రధాని మోదీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చాలని, ఆ విషయంలో ఆ పార్టీ రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని ట్వీట్ చేశారు. తమ పార్టీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో కర్ణాటకకు మరింత శక్తితో సేవలు అందిద్దామన్నారు.
-
భారత్ జోడో యాత్ర కలిసొచ్చింది: ప్రియాంక
భారత్ జోడో యాత్ర కలిసొచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో మాట్లాడుతూ... ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా, ప్రజల దృష్టిని మళ్లించేలా బీజేపీ నేతలు మాట్లాడారని అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
-
ఈసీ వెల్లడించిన ఫలితాల ప్రకారం..
EC table
-
మేజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ మేజిక్ నంబర్ దాటింది. 113 సీట్లు గెలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంటుంది. ఈసీ అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కాంగ్రెస్ 119 సీట్లు గెలుచుకుని, మరో 17 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
-
తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి: రేవంత్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
కాంగ్రెస్ మతాన్ని రాజకీయాలకు వాడుకోదు
మత రాజకీయలతో బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి రావలనుకుంది
అస్థిర రాజకీయాలతో సుస్థిర రాజకీయాలు కేసీఆర్ చేయలనుకుకున్నారు
హంగ్ ఏర్పరచి కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేయాలనుకున్నారు
కేసీఆర్ ఎత్తుగడలను కర్ణాటక ప్రజలు చిత్తు చేశారు
కర్ణాటక ఎన్నికలు రాబోయే తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి
కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి
నిన్న హిమాచల్, నేడు కర్ణాటక, రేపు తెలంగాణ
భవిష్యత్ లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది
కాంగ్రెస్ గెలుపును కెటీఆర్ ప్రజా తీర్పుగా అభివర్ణించలేదు
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కేటీఆర్ కు ఇష్టం లేదు
-
ప్రజాబలం ఉండటంతో.. అంటూ రాహుల్ కామెంట్స్
కర్ణాటక ఎన్నికల్లో ఓ వైపు క్రోనీ క్యాపిటలిస్టుల బలం, మరోవైపు ప్రజాబలం ఉండటంతో ప్రజలు వారిని ఓడించారు.
మేము ఈ యుద్ధంలో ప్రేమ మరియు ఆప్యాయతతో పోరాడాము. కర్ణాటకలో విద్వేషాల మార్కెట్ మూతపడి ప్రేమ దుకాణం తెరుచుకుంది.
- రాహూల్ గాంధీ #CongressForProgress pic.twitter.com/9P1ZeRg6tE— Telangana Congress (@INCTelangana) May 13, 2023
-
సునీల్ కనుగోలుపై ప్రశంసల జల్లు
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అరవింద్ గుణశేఖర్ అనే జర్నలిస్టు సునీల్ కనుగోలు గురించి చేసిన ట్వీటును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రీట్వీట్ చేశారు. సునీల్ కనుగోలు వ్యూహమే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిందని అందులో ఉంది. ప్రచారంలో PayCM మొదలుకొని 5 హామీల వరకు ప్రజలను కాంగ్రెస్ కు బాగా దగ్గరచేశాయన్నది ఆ ట్వీట్ సారాంశం. కర్ణాటకలో కాంగ్రెస్ బలపడడం, సమష్టి నాయకత్వం ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ ఇచ్చాయని అందులో ఉంది.
-
రాహుల్ గాంధీ ఏమన్నారు?
ఇది అందరి విజయం..ముఖ్యంగా కర్ణాటక ప్రజల విజయం
కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు
కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది
పేద ప్రజల శక్తి పెట్టుబడిదారుల బలాన్ని ఓడించింది
ఇది ప్రతి రాష్ట్రంలో రిపీట్ అవుతుంది
కర్ణాటకలో కాంగ్రెస్ పేద ప్రజలు పక్షాన నిలిచింది.. పేద ప్రజల కోసం పోరాడింది
కర్ణాటక ఎన్నికల్లో ద్వేషంతో పోటీ చేయలేదు.. ప్రేమతో పోరాడాం
ప్రేమ ఈ దేశానికి బావుంటుందని ప్రజలు చూపించారు
కర్ణాటకలో విద్వేష బజార్ మూతపడింది.. ప్రేమ దుకాణం తెరుచుకుంది
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన ఐదు హామీలను తొలి కేబినెట్ లో నెరవేరుస్తాం
కర్ణాటక ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.. ధన్యవాదాలు
-
ఏపీలో సంబరాలు
కర్ణాటక ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంతో పాటు పలు జిల్లాల్లో సంబరాలు మిన్నంటాయి. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మహిళా నేత సుంకర పద్మశ్రీ, ఇతర ముఖ్య నాయకులు స్వీట్లు పంచారు.
-
48,000 ఓట్ల మెజారిటీతో బీజేపీ మీద ఘన విజయం సాధించిన దీపాలి దాస్
ఒడిశాలోని జర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగిన ఉప ఎన్నికల్లో అధికార బిజూ జనతా దళ్ అభ్యర్థి దీపాలి దాస్ ఘన విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి టంకధర్ త్రిపాటి మీద 48,721 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. ఒడిశా ఆరోగ్య మంత్రి నబ కిశోర్ దాస్ కుమార్తె దీపాలి దాస్. ఒక పోలీసు అధికారి హత్య కేసులో నదా జైలు పాలయ్యారు. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక ఏర్పడింది.
-
కోస్తా, బెంగళూరు ప్రాంతాల్లోనే బీజేపీ.. మిగతా కర్ణాటకంతా కాంగ్రెసే
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది. ఈ రెండు ప్రాంతాలు మినహా కర్ణాటక అంతా కాంగ్రెస్ హవానే కొనసాగింది. జేడీఎస్ పార్టీకి పట్టున్న మైసూరులో కూడా కాంగ్రెస్ విజృంభించింది.
-
ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది.. ఖర్గే కుమారుడు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే పార్టీ తరపున ముఖ్యమంత్రిని అభ్యర్థిని ఎన్నికలకు ముందు ప్రకటించలేదు. పార్టీ విజయం ఖరారు కావడంతో ముఖ్యమంత్రి అభ్యర్థిపై అనేక అంచనాలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే అన్నారు. ప్రియాంక్ ఈ ఎన్నికల్లో చిత్తాపూర్ నుంచి విజయం సాధించారు. ఇది ఆయనకు వరుసగా మూడో విజయం. తనను మూడుసార్లు ఎన్నుకున్న చిత్తాపూర్ ప్రజలకు ప్రియాంక్ ధన్యావాదాలు తెలిపారు.
-
కర్ణాటక ఎన్నికల్లో విజయంపై మీడియాతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ (Live)
LIVE: Media Interaction | New Delhi https://t.co/mflXxURASX
— Rahul Gandhi (@RahulGandhi) May 13, 2023
-
ఆ ముగ్గురి వల్ల గెలిచాం: ఖర్గే
ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. "కాంగ్రెస్ కు ప్రజలు భారీ మెజార్టీ ఇస్తున్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సోనియా గాంధీ కాంగ్రెస్ విజయం కోసం చాలా శ్రమించారు. సోనియా గాంధీకి ఆరోగ్యం బాగోలేకపోయినా ప్రచారంలో పాల్గొన్నారు" అని ఖర్గే అన్నారు.
-
ప్రజల తీర్పును గౌరవిస్తాం ..
కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం, అంగీకరిస్తాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కొనసాగుతూ ప్రజల తరపున పోరాడతాం అని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
-
కన్నడ ప్రజలకు ధన్యవాదాలు.. చిదంబరం ట్వీట్
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం ట్వీట్ చేశారు. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ. నిర్ణయాత్మక తీర్పు వెలువరించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. బీజేపీ అర్థ, అంగబలానికి కర్ణాటక ప్రజలు ఎదురొడ్డి నిలిచారని అన్నారు.
Warm congratulations and sincere thanks to the people of Karnataka for delivering a decisive verdict
This election was more than an election to a State Assembly. It was about upholding the fundamental values of the Indian Constitution and stopping the damage done by supremacist…
— P. Chidambaram (@PChidambaram_IN) May 13, 2023
-
రాహుల్ గాంధీ పాదయాత్ర ఫలితమే.. సిద్ధ రామయ్య
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పాదయాత్ర కూడా కారణమని ఆ పార్టీ నేత సిద్ధ రామయ్య అన్నారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవాలన్న బీజేపీ శ్రమ ఫలించలేదని చెప్పారు.
-
క్యాంప్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. పూర్తిస్థాయిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలను ఒకేదగ్గరకు చేర్చుతుంది. రాత్రి ఎనిమిది గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. ఓ హోటల్‌లో 50రూంలను బుక్ చేసిన కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్యేలందరిని హోటల్‌కు తరలించేలా చర్యలు చేపట్టారు. ఇందుకోసం 15 హెలికాప్టర్లు సిద్ధం చేశారు. రాష్ట్ర పార్టీ సీనియర్లతో మల్లిఖర్జున్ ఖర్గే ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.
-
ప్రధాని మోదీ ఓడిపోయారు .. జైరాం రమేశ్
కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సమస్యలైన జీవనోపాధి, ఆహార భద్రత, ధరల పెరుగుదల, రైతు కష్టాలు, విద్యుత్ సరఫరా, నిరుద్యోగం, అవినీతిపై పోరాడిందని అన్నారు. ప్రధాని మోదీ మాత్రం విభజనవాదాన్ని ప్రచారం చేశారని, ఈ ఎన్నికల్లో ప్రధాని ఓడిపోయారని జైరాం రమేశ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
-
ప్రజా విజయం.. ఖర్గే
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంపై పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇది ప్రజా విజయమేనని అన్నారు.
-
భావోద్వేగానికి లోనైన డీకే శివకుమార్
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ భావోద్వేగానికి లోనైయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టానికి ఫలితం ఈ విజయం అన్నారు. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారని అన్నారు. ఈ విజయం సోనియా, రాహుల్ గాంధీలకు అంకితం అని చెప్పారు. ఈ క్రమంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
-
శిగ్గావ్ నియోజకవర్గంలో గెలిచిన కర్ణాటక ప్రస్తుత సీఎం, బీజేపీ నేత బస్వరాజ్ బొమ్మై
-
ఆంజనేయ స్వామి ఆలయంలో రేవంత్ పూజలు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, కాంగ్రెస్ నేతలు నీలోఫర్ వద్ద ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించారు అనంతరం గాంధీ భవన్ వరకు జై బజరంగ్ బలి నినాదాలు చేసూకుంటూ ర్యాలీగా వెళ్లారు. అనంతరం గాంధీ భవన్ వద్ద ఇంచార్జి ఠాక్రే కు, పీసీసీ చీఫ్ రేవంత్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ స్వీట్స్ తినిపించారు.
-
సిద్ధ రామయ్య విజయం..
వరుణ నియోజకవర్గం నుంచి సిద్ద రామయ్య (కాంగ్రెస్) విజయం సాధించారు.
-
జగదీశ్ షెట్టార్ ఓటమి ..
హబ్లీ ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గంలో జగదీశ్ షెట్టార్ ఓటమి పాలయ్యారు. బీజేపీ సీనియర్ నేత అయిన జగదీశ్ షెట్టార్‌కు బీజేపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు. కానీ, నియోజకవర్గ ఓటర్లు ఆయన నిర్ణయాన్ని తిరస్కరించి ఓడించారు.
-
బళ్లారిలో శ్రీరాములు ఓటమి..
బళ్లారిలో శ్రీరాములు (బీజేపీ) ఓటమి. కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర విజయం.
-
బసవరాజ్ బొమ్మై విజయం ..
కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బసవరాజ్ బొమ్మై విజయం సాధించారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
-
జేడీఎస్ ఆశలు గల్లంతు..
కర్ణాటకలో హంగ్ వస్తుందని, ప్రభుత్వం ఏర్పాటులో చక్రం తిప్పేది మేమేనని భావించిన జేడీఎస్‌కు కన్నడ ఓటర్లు షాకిచ్చారు. తాజా ఫలితాల్లో.. పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిశగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. దీనికితోడు గత 2018 ఎన్నికల కంటే ఈ దఫా జేడీఎస్ పార్టీ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తుంది. 2018లో 37 స్థానాల్లో జేడీఎస్ విజయం సాధించి. ప్రస్తుతం జేడీఎస్ 23 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతుంది.
-
హసన్ నియోజకవర్గంలో స్వరూప్ (జేడీఎస్) విజయం.
ధార్వాడ్ నియోజకవర్గంలో వినయ్ కులకర్ణి (కాంగ్రెస్) విజయం.
కుడ్లిగి నియోజకవర్గంలో శ్రీనివాస్ (కాంగ్రెస్) విజయం.
మొలకల్మూర్ నియోజకవర్గంలో గోపాలకృష్ణ (కాంగ్రెస్) విజయం.
చల్లకెర నియోజకవర్గంలో రఘుమూర్తి (కాంగ్రెస్) విజయం.
ఎల్లపుర నియోజకవర్గంలో శివరామ్ (బీజేపీ) విజయం.
హరియార్ నియోజకవర్గంలో సుధాకర్ (కాంగ్రెస్) విజయం.
-
ఫలితాలపై రేవంత్ కామెంట్స్..
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. పూర్తిస్థాయి మెజార్టీతో కర్ణాటకలో పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలో ముందు నుంచి మేము ఊహించిన ఫలితాలు వచ్చాయని అన్నారు. బీజేపీ ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలలో ఫిరాయిoపు రాజకీయాలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందని విమర్శించారు. నేను హిందువును, నా విశ్వాసం మేరకు పూజలు చేస్తానని, మతాన్ని రాజకీయం చేయాలనుకుంటే కర్ణాటక ఫలితాలే ఉంటాయని చెప్పారు.
-
కనకపుర స్థానం నుంచి విజయం సాధించిన కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్. 40వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం.
-
ఓటమి దిశగా కుమారస్వామి కుమారుడు. 14వేల ఓట్ల వెనుకంజంలో నిఖిల్ కుమారస్వామి.
మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ కు షాకిస్తున్న ఓటర్లు. 23వేల ఓట్ల వెనుకంజలో షెట్టారు. టికెట్ రాకపోవటంతో చివరి నిమిషంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగదీశ్ షెట్టార్.
మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి స్వల్ప ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం 554 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. కుమారస్వామికి బీజేపీ అభ్యర్థి యోగేశ్వర గట్టి పోటీఇస్తున్నారు.
-
ఇంకా విజయంపై దీమాగా బీజేపీ..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఆ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయినా బీజేపీ నేతలు మేం ఆధిక్యంలోకి వస్తామని దీమాతో ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ మారుతాయని, రౌండ్లు లెక్కింపు పెరుగుతున్నా కొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందని ఢిల్లీ బీజేపీ నేత సుధాన్షు త్రివేది అన్నారు.
-
120 స్థానాల్లో గెలుస్తున్నాం.. సిద్ధ రామయ్య
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. దీంతో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. 120 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని అన్నారు.
-
50 స్థానాల్లో వెయ్యి ఓట్ల తేడానే..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 116 స్థానాల్లో కాంగ్రెస్, 73 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో జెడీఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతోంది. కనీసం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. దీంతో ఈ స్థానాల్లో ఫలితాలు ఎప్పుడైనా తారుమారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
-
గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.
-
బళ్లారి రూరల్‌లో వెనుకంజలో శ్రీరాములు..
బళ్లారి జిల్లాలోని బళ్లారి రూరల్ నియోజక వర్గంలో 9వ రౌండ్ పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి శ్రీరాములుపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగేంద్ర 22,850 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి శ్రీములు ఏజెంట్లు కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు
-
కర్ణాటకలో ఆరుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ 15,098 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధ రామయ్య 1,224 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా చామరాజనగర్ నుంచి పోటీ చేస్తున్న సోమన్న కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగశెట్టిపై 9వేల ఓట్ల మెజార్టీతో వెనుకంజలో ఉన్నారు.
-
జేడీఎస్ నేతలతో కుమారస్వామి సమావేశం..
జేడీఎస్ నేతలతో హెచ్‌డీ కుమారస్వామి సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.
-
ఎన్నికల కమిషన్ ప్రకారం తాజా ఫలితాలు..
ప్రస్తుతానికి పార్టీల వారిగా ఓట్ల శాతం చూస్తే.. బీజేపీకి 36.17శాతం, కాంగ్రెస్ పార్టీకి 43.22శాతం, జేడీ(ఎస్) పార్టీకి 12.71శాతం ఓట్లు వచ్చాయి.
Election Commission
-
యడ్యూరప్పకు పెద్ద ఎదురు దెబ్బ..
మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. శివమొగ్గ జిల్లాలోని ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఐదు నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.
-
కర్ణాటక రాష్ట్రంతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో కూడా బీజేపీ వెనుకబడింది. ఆప్, బీజేడీ, ఎస్పీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల ప్రకారం..
జలంధర్ లోక్‌సభ స్థానం (పంజాబ్) - ఆప్ ఆధిక్యం
చాన్బే అసెంబ్లీ స్థానం (ఉత్తరప్రదేశ్) - సమాజ్‌వాదీ పార్టీ
సౌర్ అసెంబ్లీ స్థానం (ఉత్తరప్రదేశ్) - అప్నాదళ్
జర్సుగూడ అసెంబ్లీ స్థానం (ఒడిశా) - బీజేడీ
-
ఆధిక్యంలో ఉన్న నేతలు..
చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక ఖర్గే.
శికారిపుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయేంద్ర.
గంగావతి నియోజకవర్గం నుంచి కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి జనార్ధనరెడ్డి.
రామనగర నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమార్ స్వామి.
కొరటగెరె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి. పరమేశ్వర.
వరుణ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామయ్య ఆధిక్యంలో ఉన్నారు.
-
జగదీష్ షెట్టర్ వెనుకంజ..
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 8వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి మహేశ్ టైంగింకై పై జగదీష్ షెట్టర్ 11వేల ఓట్లకుపైగా వెనుకంజలో ఉన్నారు.
-
సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
మహారాష్ట్ర ఉద్ధవ్ వర్గానికి చెందిన నేత సంజయ్ రౌత్ కర్ణాటక ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తలపై భజరంగబలి గద్దె పడిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంటే అది మోదీ, అమిత్ షాల ఓటమేనని చెప్పారు. ఇదే పరిస్థితి 2024లోనూ బీజేపీకి ఎదురవుతుందని ఆయన జోస్యం చెప్పారు.
-
మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గంలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య తన ఇంటి నుంచి కౌంటింగ్ కేంద్రానికి బయలుదేరారు.
-
బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..
కర్ణాటకలో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. కాంగ్రెస్‌కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని అన్నారు.
-
క్యాంపుకు కాంగ్రెస్ అభ్యర్థులు ..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మ్యాజిక్ పిగర్ 113 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 114 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను ఈగల్ టన్ రిసార్ట్‌కు తరలిస్తుంది.
-
ముంబై కర్ణాటకలో ఆధిక్యంలో కాంగ్రెస్
-
కోస్టల్ కర్ణాటకలోనూ ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ
-
ఆధిక్యంలో తండ్రీ కొడుకులు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఇద్దరూ తమతమ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
సిమ్లా హనుమాన్ ఆలయంలో ప్రియాంక గాంధీ ప్రత్యేక పూజలు
-
కనకపుర నియోజకవర్గంలో డీకే శివకుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం..
కర్ణాటక రాష్ట్రంలో ఫలితాలపై ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 45 స్థానాల్లో, జేడీఎస్ 16 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
-
హుబ్లీ ధార్వాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టార్ (మాజీ సీఎం) వెనుకంజలో ఉన్నారు.
-
చిత్తాపూర్ నియోజకవర్గంలో ప్రియాంక్ ఖర్గే ముందంజలో ఉన్నారు.
-
గంగావతి నియోజకవర్గంలో గాలి జనార్దన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
బళ్లారి జిల్లాలో..
బళ్లారి జిల్లాలోని బళ్లారి అర్బన్ నియోజక వర్గంలో మూడవ రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారా భరత్ రెడ్డి 2500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు
శిరిగుప్ప నియోజక వర్గంలో రెండవ రౌండ్ పూర్తి అయ్యే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.యన్ నాగారాజు 3,236 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కంప్లీ నియోజక వర్గంలో బిజేపి పార్టీ అభ్యర్థి సురేష్ బాబు 325 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
బెంగళూరు రండి..
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో విజయానికి చేరువలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వెంటనే బెంగళూరు చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది.
-
ఎనిమిది మంది మంత్రులు వెనుకంజలో ..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు.
-
ఢిల్లీలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు షురూ..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంబురాలు మొదలయ్యాయి. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దాటి 114 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
-
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య తనయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సీఎం కావాలని అంటున్నారు.
-
బళ్లారిలో గాలి అరుణలక్ష్మీ వెనుకంజలో ఉన్నారు.
-
వరుణ నియోజకవర్గంలో మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి సిద్ద రామయ్య ముందంజలో ఉన్నారు.
-
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు..
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు దాటేసి 132 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 73, జేడీఎస్ 17, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో ఉన్నారు. పూర్తిస్థాయి మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటంతో సంబురాలు మొదలు పెట్టారు.
-
తీర్థహళ్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కిమ్మనే రత్నాకర్ పై బీజేపీ మంత్రి అరగ జ్ఞానేంద్ర 184 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
బెలగావి సౌత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అభయ్ పాటిల్ 5,178 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
ఆధిక్యంలో సీఎం బొమ్మై ..
షిగ్గావ్ నియోజకవర్గంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
కొత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బాబాసాహెబ్ పాటిల్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహంతేష్ దోడగౌడర్ పై 337 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్ ..
కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కౌటింగ్‌లో మొదటి రౌండ్ దాటేసరికే కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. దీంతో హస్తం పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. కర్ణాటకలో మ్యాజిగ్ ఫిగర్ 113కాగా కాంగ్రెస మొదటిరౌండ్ దాటేసరికే 124 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
-
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్కమగళూరు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు.
-
బళ్లారి రూరల్ నియోజకవర్గంలో మంత్రి బి. శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు.
-
ఫలితాల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్ ..
కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో దూసుకెళ్తుంది. 110 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు 86 అసెంబ్లీ స్థానాల్లో, 18 చోట్ల జేడీఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
-
చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆధిక్యంలో ఉన్నారు.
-
నార్గుండ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సీసీ పాటిల్ వెనుకంజలో ఉన్నారు.
-
సీఎం బసవరాజ్ బొమ్మై పూజలు ..
హుబ్బళ్లిలో హనుమాన్ మందిర్‌లో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజల తీర్పు వెలువడుతుంది. బీజేపీ సంపూర్ణ మెజార్టీతో గెలిచి సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు.
-
డిమాండ్లు ఏమీ లేవు.. కుమారస్వామి
జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి పొత్తులపై తాజా ప్రకటన చేశారు. మాది చిన్న పార్టీ. మాకు ఎలాంటి డిమాండ్లు లేవు అన్నారు. మరో రెండుమూడు గంటల్లో ఫలితం తేలిపోతుంది. ఆ ఫలితాలను బట్టి మా నిర్ణయం ఉంటుందని అన్నారు.
-
రామనగరంలో జేడీ(ఎస్) అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. ఆయన మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి తనయుడు.
-
కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. కాంగ్రెస్ 79 స్థానాల్లో, బీజేపీ 55 స్థానాల్లో, జేడీ(ఎస్) 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
-
గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన సిద్ధ రామయ్య..
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ద రామయ్య అన్నారు. కాంగ్రెస్ 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
-
కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు..
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ 82 స్థానాల్లో, కాంగ్రెస్ 76 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
-
హబ్బళ్లి - ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి జగదీష్ షెట్టర్ ముందంజలో ఉన్నారు. మాజీ సీఎం శెట్టర్ బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
-
రాయిచూర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్. కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు. భారీగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కార్యకర్తలు.
-
కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కాసేపట్లో ట్రెండ్స్ రావడం మొదలవుతుంది.
-
Watch Live Updates 10Tv
-
విజేతలు బెంగళూరుకు రావాలి ..
పార్టీ విజేతలంతా బెంగళూరుకు వచ్చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ‘ఆపరేషన్ కమల్’ లో వారెవరూ చిక్కుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
-
12గంటల వరకు వేచి చూద్దాం.. కుమారస్వామి
మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి సింగపూర్ నుంచి శుక్రవారం అర్థరాత్రి తరువాత బెంగళూరు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా జేపీ నగర్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 12 గంటల వరకు వేచి చూద్దాం.. ఫలితాలను బట్టి తమ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.
-
స్వతంత్ర అభ్యర్థులపై పార్టీల దృష్టి..
ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఆరు నుంచి ఎనిమిది నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారని వెల్లడించాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫలితాలకు ముందే వారిని తమ పార్టీ వైపుకు మళ్లించుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి.
-
Watch Live Updates 10Tv
-
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ..
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 224 అసెంబ్లీ స్థానాలకు పోటీపడ్డ 2615 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది సేపట్లో తేలుతుంది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు అవసరం. ఈసారి ఎన్నికల్లో 73.19 శాతం ఓటింగ్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో హంగ్ వస్తుందని, మరికొన్ని బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయని అంచనా వేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
-
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 34 జిల్లాల్లో 36 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 306 హాల్స్ 4256 రౌండ్స్ లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియలో 13,309 మంది సిబ్బంది పాల్గోనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తరువాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఓ క్లారిటీ రానుంది.