ఎన్నికల ప్రచారంలో నాగిని డాన్స్ వేసిన మంత్రి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి  ఎమ్ టీబీ నాగరాజ్ (67) రోడ్డుపై బాలీవుడ్ మూవీ నాగిన్ లోని పాపులర్ ట్యూన్ కి స్టెప్పులేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 10, 2019 / 12:56 PM IST
ఎన్నికల ప్రచారంలో నాగిని డాన్స్ వేసిన మంత్రి

Updated On : April 10, 2019 / 12:56 PM IST

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి  ఎమ్ టీబీ నాగరాజ్ (67) రోడ్డుపై బాలీవుడ్ మూవీ నాగిన్ లోని పాపులర్ ట్యూన్ కి స్టెప్పులేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి  ఎమ్ టీబీ నాగరాజ్ (67) రోడ్డుపై బాలీవుడ్ మూవీ నాగిన్ లోని పాపులర్ ట్యూన్ కి స్టెప్పులేశారు. పబ్లిక్ అందరూ చూస్తుండగా రోడ్డుపై పూనకమొచ్చినట్లు నాగిన్ డాన్స్ వేశారు. చిక్కబళ్లాపుర లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వీరప్ప మొయిలీ తరపున ప్రచారం చేసేందుకు బుధవారం (ఏప్రిల్-10,2019) హొసకోటె లోని కట్టిగెనహళ్లి గ్రామానికి మంత్రి నాగరాజ్ వెళ్లారు.
Read Also : ముద్దంటూ కొరికేశాడు : 300ల కుట్లు..12 ఏళ్ల జైలు

గ్రామంలో ఓ మ్యూజిక్ బ్యాండ్ మంత్రిగారి కాన్వాయ్ ని ఫాలో చేసింది. ఈ సమయంలో ఓ ట్యూన్ మంత్రగారిని ఆకర్షించింది.ఇంకేముంది ప్రచారరథంపై నుంచి కిందకి దిగి డాన్స్ వేశారు. మంత్రిగారి మద్దతుదారులు కూడా ఆయనతో కలిసి స్టెప్పులేశారు. దాదాపు 10నిమిషాలపాటు నాన్ స్టాప్ గా స్టెప్పులేశారు.అయితే వయసు దృష్యా డాన్స్ ఆపాలని మద్దుతుదారులు కోరడంతో ఆయన డాన్స్ ని ఆపేశారు.

గతంలో కూడా పబ్లిక్ ప్లేస్ లలో మంత్రిగారు తన డ్యాన్స్ ప్రతిభను బయటపెట్టారు.ఎమ్ టీబీ నాగరాజ్ దేశంలోని ధనికుడైన ఎమ్మల్యే ఆయన ఆస్తుల విలువ 1000కోట్లు ఉంటుందని గతేడాది ఏడీఆర్ తెలిపింది. ఏప్రిల్-18,23న రెండు దశల్లో కర్ణాటక లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మే-23,2019న ఫలితాలు వెలువడనున్నాయి