Karnataka : కర్ణాటక మంత్రులకు అత్యాధునిక కార్లు.. 33 కార్ల కొనుగోలుకు రూ.9.9 కోట్లు
కర్ణాటక రాష్ట్ర మంత్రులు కొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లను పొందనున్నారు. ఒక్కో మంత్రికి ఒక కారు చొప్పున 33 కార్లను కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.9.9 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది....

Karnataka ministers high-end cars
Karnataka Ministers : కర్ణాటక రాష్ట్ర మంత్రులు కొత్త హై-ఎండ్ హైబ్రిడ్ కార్లను పొందనున్నారు. ఒక్కో మంత్రికి ఒక కారు చొప్పున 33 కార్లను కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.9.9 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది. (Karnataka ministers to get high-end rides) ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో కూడిన ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పూర్తిగా ఇథనాల్‌తో నడిచే కారు అయిన టయోటా నుంచి ఇటీవల విడుదల చేసిన హైబ్రిడ్ హైక్రాస్ వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆర్డర్ చేసింది. (33 cars to cost Rs 9.9 crore)
Nuclear Power Plant : గుజరాత్ అణు విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం
ప్రముఖ ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్ ఆగస్ట్ 29వతేదీన అధికారికంగా విడుదలైంది. ఒక్కో కారు ఖరీదు రూ.30 లక్షలు. ప్రభుత్వం టయోటా కిర్లోస్కర్ నుండి నేరుగా కార్లను కొనుగోలు చేయనుంది. మంత్రుల కోసం హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై బీజేపీ విమర్శలను గుప్పిస్తోంది.
IAF Trishul exercise : పాక్, చైనా సరిహద్దుల్లో ఐఏఎఫ్ త్రిశూల్ విన్యాసాలు
బీజేపీ ఎమ్మెల్యే అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రం ఆర్థిక, ప్రకృతి వైపరీత్యాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ సొమ్మును ప్రజల సంక్షేమానికి వినియోగించాలని బీజేపీ ఎమ్మెల్యే కోరారు.