బీజేపీ నేత బెడ్ రూంలో బాలిక అనుమానాస్పద మృతి

  • Published By: murthy ,Published On : September 28, 2020 / 10:43 AM IST
బీజేపీ నేత బెడ్ రూంలో బాలిక అనుమానాస్పద మృతి

Updated On : September 28, 2020 / 11:45 AM IST

karnataka minor girl: బెంగుళూరులో దారుణం జరిగింది. ఒక బీజేపీ నేత మైనర్ బాలిక ఆ నేత బెడ్ రూం లో శవమై తేలింది. తుమకూరు నగరం ఆదర్సనగర్ లో జడ్పీ సభ్యుడు, బీజేపీ నాయకుడు రామాంజినప్ప ఇంట్లో మృతురాలు (17) అనుమానాస్పదరీతిలో బెడ్ రూంలో శవంగా పడి ఉంది. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తుమకూరు తాలుకాలోని బిదరెకట్టి గ్రామానికి చెందిన శివణ్ణ, మంజుల దంపతులు 10 ఏళ్లుగా శాంతి నగర్ లో నివాసం ఉంటున్నారు.



శివణ్ణ పానీపూరి వ్యాపారం నిర్వహిస్తుండగా… మంజుల రామాంజినప్ప ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. వీరి కూతురు అప్పుడప్పుడు తల్లికి సహాయంగా రామాంజినప్ప ఇంటికి వెళుతూ ఉండేది. ఆదివారం తల్లి పనికి వెళ్లక పోవటంతో కుమార్తె ఒక్కతే రామాంజినప్ప ఇంటిలో పని చేయటానిక వెళ్లింది.



మధ్యాహ్నం సమయంలో మైనర్ బాలిక మృతి చెందినట్లు రామాంజినప్ప కుటుంబం మంజులకు చెప్పారు. రామాంజినప్ప తుముకూరు పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక మృతదేహా్న్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. బాలిక ఎలా మృతి చెందింది అనేది మిస్టరీగా మారింది. పోలీసు విచారణలో నిజాలు వెలుగు చూస్తాయి.