Karnataka School children: జేసీబీ ద్వారా బ్రిడ్జిని దాటిన పాఠశాల విద్యార్థులు.. వీడియో వైరల్

భారీ వర్షాలకు ఓ బ్రిడ్జి మునిగిపోవడంతో పాఠశాల విద్యార్థులకు జేసీబీ ద్వారా ఆ వంతెనను దాటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా గుళేదగుడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల ధాటికి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే.

Karnataka School children: జేసీబీ ద్వారా బ్రిడ్జిని దాటిన పాఠశాల విద్యార్థులు.. వీడియో వైరల్

Karnataka School children

Updated On : September 7, 2022 / 3:46 PM IST

Karnataka School children: భారీ వర్షాలకు ఓ బ్రిడ్జి మునిగిపోవడంతో పాఠశాల విద్యార్థులకు జేసీబీ ద్వారా ఆ వంతెనను దాటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా గుళేదగుడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల ధాటికి కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వరదల ధాటికి గుళేదగుడ్డలోని బ్రిడ్జి నీటిలో ఒక్కసారిగా మునిగింది.

ఉదయం పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో బ్రిడ్జి పై నీరు ఉండడంతో అక్కడే ఉండిపోయారు. దీంతో స్థానిక వ్యక్తికి చెందిన ఓ జేసీబీ మిషన్ లో విద్యార్థులను ఎక్కించి బ్రిడ్జిని దాటించారు. జేసీబీలో డ్రైవర్ కూర్చునే స్థానంలోనే కాకుండా దాని ముందు ఉండే లోడర్ బకెట్లో కూడా విద్యార్థులు కూర్చొని బ్రిడ్జిని దాటారు. మరోవైపు, బెంగళూరులో భారీ వర్షాల ధాటికి కార్లు నడవని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు అధికారులు ట్రాక్టర్లలో కార్యాలయాలకు వెళ్తున్నారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు