Karsevak injured : 1992నాటి బాబ్రీ మసీదు కూల్చివేతలో గాయపడిన కరసేవకుడు…మోదీని ఏం కోరారంటే…

పవిత్ర అయోధ్య నగరంలో నాడు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని పక్షవాతానికి గురైన కరసేవకుడు అచల్ సింగ్ మీనా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంచలన విజ్ఞప్తి చేశారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అచల్ సింగ్ ప్రధానమంత్రిని కోరారు....

Karsevak injured : 1992నాటి బాబ్రీ మసీదు కూల్చివేతలో గాయపడిన కరసేవకుడు…మోదీని ఏం కోరారంటే…

Karsevak Achal Meena Singh

Karsevak injured : పవిత్ర అయోధ్య నగరంలో నాడు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొని పక్షవాతానికి గురైన కరసేవకుడు అచల్ సింగ్ మీనా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంచలన విజ్ఞప్తి చేశారు. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని అచల్ సింగ్ ప్రధానమంత్రిని కోరారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగర సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అచల్ సింగ్ మీనా 1992 డిసెంబరులో కరసేవకుడిగా అయోధ్య వచ్చారు.

ALSO READ : Arvind Kejriwal : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అర్వింద్ కేజ్రీవాల్‌కు నాల్గవసారి ఈడీ సమన్లు జారీ

నాడు 30 ఏళ్ల అచల్ బాబ్రీ మసీదును కూల్చివేస్తుండగా శిథిలాలు అతనిపై పడ్డాయి. దీంతో అచల్ పక్షావాతానికి గురయ్యారు. గాయపడిన అచల్ ను మొదట మొదట ఫైజాబాద్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఆపై అతన్ని లక్నోలోని గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ అచల్ స్పృహలోకి వచ్చాడు, కానీ అప్పటి నుంచి అతను నడవలేడని స్థానికులు చెప్పారు.

ALSO READ : IAF-32 aircraft : బంగాళాఖాతంలో విమానం కూలి 29 మంది మృతి… ఐఏఎఫ్‌ విమాన శకలాలు లభ్యం

జనవరి 22న జరిగే మెగా ఈవెంట్‌ తర్వాత ఒకసారి రామమందిరాన్ని సందర్శించేందుకు అనుమతించాలని అచల్ సింగ్ మీనా ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌కు విజ్ఞప్తి చేశారు. రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్లాలని తన కోరికను అచల్ వ్యక్తం చేశాడు.