370రద్దును స్వాగతిస్తున్నాం : పాక్ పై జమాత్ ఉలేమా ఫైర్

ఆర్టికల్ 370రద్దు చేస్తూ మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ లో అతిపెద్ద ముస్లిం ఆర్గనైజేషన్.. జమాత్ ఉలేమా హి హింద్(JUH) స్వాగతించింది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని జమాత్ ఉలేమా చీఫ్ మెహమూద్ మదానీ తెలిపారు. వేర్పాటు వాద ఉద్యమాన్ని JUHఎప్పటికీ సపోర్ట్ చెయ్యదని ఆయన తెలిపారు.
కశ్మీర్ ను అక్రమంగా భారత్ లో కలిపేశారంటూఆరోపిస్తున్న వేర్పాటువాదుల చర్యలను తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు. వేర్పాటువాద ఉద్యమాలు భారత్ కు మాత్రమే కాకుండా కశ్మీర్ ప్రజలకు కూడా హానికరం అని ఆయన అన్నారు. ముస్లింలు భారత్ కు వ్యతిరేకంగా ఉన్నారన్న వాదాన్ని పాకిస్థాన్ అంతర్జాతీయంగా వినిపించాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. పాక్ చర్యలను తాము ఖండిస్తున్నామని ఆయన చెప్పారు.
భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమన్న తీర్మానాన్ని ఆమోదించినట్లు ఆయన తెలిపారు. దేశ భద్రత, సమగ్రత అంశంలో రాజీపడేదిలేదన్నారు. మేం భారతీయులమే, దానికి మేం కట్టుబడి ఉన్నామని జమాత్ ఉలేమా చీఫ్ తెలిపారు. భారత్ లో పూర్తిగా కశ్మీర్ కలవడం వల్లే అక్కడ సంక్షేమం వెల్లువిరుస్తుందని ఆయన అన్నారు.
#WATCH Mahmood Madani, Jamiat Ulema-e-Hind: Kashmir hamara tha, hamara hai, hamara rahega. Jahan Bharat hai wahin hum. pic.twitter.com/mSsrxEYGAm
— ANI (@ANI) September 12, 2019