మేఘలాయ ర్యాట్ హోల్ : మిరాకిల్ జరిగేవరకూ ఆపొద్దు!

మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన ర్యాట్ హోల్ (ఇరుకు సొరంగం)లో చిక్కుకుపోయిన 15 మంది మైనింగ్ కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.

  • Published By: sreehari ,Published On : January 11, 2019 / 11:37 AM IST
మేఘలాయ ర్యాట్ హోల్ : మిరాకిల్ జరిగేవరకూ ఆపొద్దు!

Updated On : January 11, 2019 / 11:37 AM IST

మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన ర్యాట్ హోల్ (ఇరుకు సొరంగం)లో చిక్కుకుపోయిన 15 మంది మైనింగ్ కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.

  • కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచన 

మేఘాలయలోని అత్యంత ప్రమాదకరమైన ర్యాట్ హోల్ (ఇరుకు సొరంగం)లో చిక్కుకుపోయిన 15 మంది మైనింగ్ కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది. ర్యాట్ హోల్ లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకొని సహాయక చర్యలను వేగవంతం చేయాలని సుప్రీం సూచించింది. ‘‘సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉండండి. ప్రయత్నాలు ఆపొద్దు. గనిలో చిక్కుకున్న కార్మికుల్లో ఎవరో ఒకరు జీవించి ఉండే అవకాశం ఉంది . ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. అప్పటివరకూ మైనింగ్ లో సహాయక చర్యలు ఆగొద్దు’’ అని జస్టిస్ ఏకే సిక్రి నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది.

గత ఏడాది డిసెంబర్ 13న మేఘాలయ ర్యాట్ గనిలో 15 మంది మైనింగ్ కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి ఇప్పటివరకూ ఒకరి ఆచూకీ కూడా లభించలేదు. కేంద్రం, మేఘాలయ ప్రభుత్వం మైనింగ్ కార్మికుల జాడ కోసం దాదాపు 200 నేవీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఒడిషా ఫైర్ సర్వీసు, స్టేట్ డిజాస్టర్ రిస్పాన్స్ ఫండ్, స్టేట్స్ ఫైర్ సర్వీసు, మల్లీ ఏజెన్సీ సిబ్బందిని రంగంలోకి దింపి వారితో గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు మేఘాలయాలో అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని, అధికారులు ఎందుకు వారిని అనుమతించారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అక్షింతలు వేసింది. ర్యాట్ హోల్ గనిలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటివరకూ గని నుంచి 2.1 కోట్ల నీటిని బయటకు తోడారు. ఎంత లోతుగా వెళ్లినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు.