Kerala Boy: జుట్టు స్ట్రైట్ చేసుకోబోయి కాలిపోయిన 12ఏళ్ల పిల్లోడు

కొత్త వింత.. పాత రోత ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్ ఇదే. కొత్త పనులు చేయడం కోసం దేనికైనా రెడీ అయిపోతున్నారు. అయితే కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు నిపుణులు, దాని గురించి తెలిసిన వారి పర్యవేక్షణలో ..

Kerala Boy: జుట్టు స్ట్రైట్ చేసుకోబోయి కాలిపోయిన 12ఏళ్ల పిల్లోడు

Kerala Boy Dies While Trying To Straighten Hair

Updated On : March 25, 2021 / 11:54 AM IST

Kerala Boy: కొత్త వింత.. పాత రోత ఇప్పుడు నడుస్తోన్న ట్రెండ్ ఇదే. కొత్త పనులు చేయడం కోసం దేనికైనా రెడీ అయిపోతున్నారు. అయితే కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు నిపుణులు, దాని గురించి తెలిసిన వారి పర్యవేక్షణలో ఉంటే పర్లేదు కానీ, సొంత ప్రయోగాలు చేస్తేనే కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలానే ఓ 12ఏళ్ల కుర్రాడు జుట్టు స్ట్రైట్ చేసుకునే పనిలో భాగంగా చేసిన పని అతని ప్రాణం తీసింది.

ఓ యూట్యూబ్ వీడియో చూస్తూ కిరోసిన్ తో జుట్టు స్ట్రైట్ చేయాలనుకున్నాడు. అది చూస్తూనే అగ్గిపుల్లతో నిప్పంటించుకోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. తిరువనంతపురంలో ఏడో తరగతి చదువుతున్న శివనారాయణను బాధితుడిగా గుర్తించారు.

తలకు కిరోసిన్ రాసుకుని జుట్టు స్ట్రైట్ చేయాలనుకుని అగ్గిపుల్లతో నిప్పంటించుకున్నాడు. కేవలం అతని నాయనమ్మ మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో బాత్రూంలో ఈ పని చేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పిరిట్ ఉపయోగించి జుట్టు స్ట్రైట్ చేసుకునే వీడియోలు వైరల్ అవుతుండటంతో వాటిని అనుకరించేందుకు ప్రయత్నించాడు.

విషయం తెలిసి హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపే అతను మరణించినట్లుగా వైద్యులు చెప్పారు. అతను ఎప్పుడూ సోషల్ మీడియాలోనే కాలం గడుపుతుండే వాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.