Kerala Road Accident : కేరళలో పెను విషాదం..శబరిమలనుంచి తిరిగివస్తున్న 8 మంది అయ్యప్ప భక్తులు మృతి
కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసుకుని శబరిమలలో కొలువైన అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా కొంతమంది అయ్యప్ప భక్తులు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లాలోని కుమిలి ప్రాంతంలో అదుపు తప్పిన బస్సు లోయలో పడిపోయింది. ఈప్రమాదంలో ఎనిమిదిమంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు.

Eight ayyappa devotees from tamilnadu In road accident died
Kerala Road Accident : కేరళలో పెను విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప మాల ధరించి దీక్ష పూర్తి చేసుకుని శబరిమలలో కొలువైన అయ్యప్పను దర్శించుకుని తిరిగి వస్తుండగా కొంతమంది అయ్యప్ప భక్తులు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లాలోని కుమిలి ప్రాంతంలో అదుపు తప్పిన బస్సు లోయలో పడిపోయింది. ఈప్రమాదంలో ఎనిమిదిమంది అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మృతులంతా తమిళనాడు రాష్ట్రాలనికి చెందివారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 8 మంది అయ్యప్ప భక్తులు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సహాయక చర్యల్ని చేపట్టి గాయపడివారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనంలో ఓ చిన్నారి (మణికంఠ స్వామి)తో 10మంది ఉండగా వారిలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోగా ఇద్దరు ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరిలో ఒకరిపరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు దీక్ష పూర్తి చేసుకుని శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి దర్శనం పూర్తి అయ్యాక తిరిగి శుక్రవారం ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈక్రమంలో కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కుమిలి ప్రాంతంలో వారి ప్రయాణించే వాహనం అదుపు తప్ప లోయలో పడిపోవటంతో ఈ దారుణం జరిగింది.