Kerala Government: ప్రభుత్వ ఉద్యోగులకు యూట్యూబ్ ఛానళ్లు ఉండొద్దు.. కేరళ సర్కార్ ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.

Kerala GOVT
Kerala Government: స్టార్డమ్ తో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో అధికశాతం మంది యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని ఆదాయ మార్గాలను సమకూర్చుకుంటున్నారు. చిన్నారులు, పెద్దవారి వరకు అనేకమంది ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్ ఛానెల్స్ నడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులుసైతం యూట్యూబ్ ఛానెల్స్ నడుపుతూ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. వంటలు, కామెడీ కార్యక్రమాలు, పలురకాల వీడియోలు అప్‌లోడ్ చేస్తూ అదనపు ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారు. ఈ ఆదాయమార్గంపై వేటు వేస్తూ తాజాగా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kerala Government: ఆ వస్తువులకు మా రాష్ట్రంలో జీఎస్టీ అమలుచేయం.. కేరళ సర్కార్ కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే విధంగా యుట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాంట్ ఫాంలలో వీడియోలను పోస్ట్ చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు కార్మిక, నైపుణ్యాల శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆర్ఎస్ రూసీ ఉత్తర్వులుసైతం జారీ చేశారు. అయితే, ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్ఛ ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించడానికి అనుమతించినప్పటికీ.. వారు నిర్ధిష్ట సంఖ్యలో సబ్ స్క్రైబర్లను కలిగి ఉండాలని, యూట్యూబ్ ఛానెల్ నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందడానికి అనుమతించబడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యూట్యూబ్ నడుపుతున్న ప్రభుత్వ ఉధ్యోగులు తమ ఛానెల్స్ ను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్ ఛానల్స్ ను నిర్వహించవద్దని, ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.