పచ్చని ఆలోచన, జప్తు చేసిన వాహనాలపై కూరగాయలు పండిస్తున్న పోలీసులు

  • Published By: nagamani ,Published On : September 17, 2020 / 10:42 AM IST
పచ్చని ఆలోచన, జప్తు చేసిన వాహనాలపై కూరగాయలు పండిస్తున్న పోలీసులు

Updated On : September 17, 2020 / 11:18 AM IST

పోలీసులు పలు కేసుల్లో జప్తు చేసి స్వాధీనం చేసుకున్న వాహనాలను ఓ చోట ఉంచుతారు. అలా వందలాది వేలాది వాహనాలు తుప్పు పట్టి పాడైపోతుంటాయి. ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతాయి. కానీ కేరళ పోలీసులు మాత్రం అలా పాడైపోయిన వాహనాలను పచ్చని హరితవనంలా మార్చేశారు. తుప్పు పట్టిన వాహనాలే ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి.


ద్విచక్ర వాహనాల నుంచి కార్లు..లారీలు..వ్యాన్లు..భారీ వాహనాలు ఇలా చాలా రకాల వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచారు. వాటిలో కూరగాయాలు..పూలమొక్కలు పెంచటం ప్రారంభించటంతో అవి నేడు పచ్చగా కళకళలాడుతున్నాయి. కేరళ పోలీసులకు వచ్చిన ఐడియాతో అవి ఈ రకంగా ఉపయోగపడుతున్నాయి.


జప్తు చేసిన వాహనాలను వేలం వేసే అధికారం పోలీసులకు ఉన్నప్పటికీ చట్టపరమైన అడ్డంకులు ఎన్నో ఉంచటంతో వాటిని అలాగే ఉంచేశారు. అలా నెలు సంవత్సరాలు గడిచిపోవటంతో అవి ఎండకు ఎండి వానకు తడిచి తుప్పు పట్టి ఎందుకు పనికిరాకుండా పోయి…చివరికి మట్టిలో కలిసిపోతున్నాయి. 2019 నివేదిక ప్రకారం కేరళ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో 40 వేలకు పైగా ఇలాంటి వాహనాలు పడి ఉన్నాయి.


వీటిని ఏం చేయాలో తెలియని త్రిసూర్ జిల్లాలోని చెరుతుర్తి పోలీస్ స్టేషన్ అధికారులకు అద్భుతమైన ఐడియా వచ్చింది. అంతే..అనుకున్నదే తడవుగా..పాడైన వాహనాలన్నీ పచ్చగా కళకళలాడడం మొదలుపెట్టాయి. ఆ వాహనాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల పెంపకం మొదలుపెట్టారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సివిల్ పోలీస్ ఆఫీసర్ రంగరాజ్ వాహనాల్లో మొక్కల పెంపకాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చక్కగా వాటిని సంరక్షిస్తూ సేంద్రీక కూరగాయాలను పండిస్తున్నారు. ఆయనతో పాటు ఇతర అధికారులు సింప్సన్, సుధాకరన్, బాబీ, రంజిత్, రఘు, అనిల్ వంటివారితో కలిసి వాటి బాగోగులు చూసుకుంటున్నారు.



https://10tv.in/kenada-rat-eat-ganja-leaves-died-in-farm/
ఈ సందర్భంగా సింప్సన్ మాట్లాడుతూ..మట్టి, ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న కొన్ని మినీ లారీలను కొన్నాళ్ల క్రితం పట్టుకున్నామని..వాటిని ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో వాటిలో కూరగాయలు పెంచాలని మూడు నెలల క్రితం అనుకున్నామనీ..తెలిపారు. దీంతో మొక్కలు ఆరోగ్యంగా పెరిగి చక్కటి పంటని దిగుబడి చేశాయని..గత వారం పంట దిగుబడి వచ్చిందనీ.. వాటిని తమ పోలీస్ స్టేషన్ క్యాంటీన్‌కు అందజేశామని తెలిపారు.


ఇది మంచి ఫలితాలను ఇవ్వటంతో ఇకనుంచి దాన్ని కొనసాగిద్దామని అనుకుంటున్నామనీ..నిరుపయోగంగా ఉన్నవాటిని ఉపయోగించుకోవాలనుకుంటున్నామని తెలిపారు. మిగతా వాహనాల్లో కూడా పంటలు పండించాలనుకుంటున్నామని తెలిపారు.
తొలి పంట దిగుబడిలో బెండకాయ, పాలకూర, పొడవు బీన్స్ పండించామనీ..ఇప్పుడు మరిన్ని రకాల కూరగాయలు పండించేందుకు రెడీ అవుతున్నామన్నారు. త్రిసూర్ జిల్లా పోలీసుల వినూత్న ఆలోచనను మెచ్చుకోకుండా ఉండలేమని ఇది చాలా చక్కటి ఆలోచన అని పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.