కేరళ గవర్నమెంట్ సూపర్ ట్రాన్స్‌పోర్ట్: తొలిసారి ట్యాక్సీ పడవలు

Kerala Water Taxi: రోడ్లపై ట్యాక్సీ కార్లు తిరుగుతాయి. మరి వాటర్‌లో ఎలా… ట్యాక్సీ పడవలు కూడా ఉంటే ఈజీ అయిపోతుంది కదా. రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లను తప్పించడానికి ఇంకొక బెటర్ ఆప్షన్ ఆలోచించిన కేరళ గవర్నమెంట్ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
కేరళ ప్రభుత్వం కొత్తగా వాటర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసుకు ఓకే చెప్పింది. ఈ సర్వీసును రాష్ట్రంలో వాటర్ ట్యాక్సీ అని పిలుస్తారు. ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి 10మంది సీటింగ్ కెపాసిటీతో కూడిన సర్వీసును మొదలుపెట్టనున్నారు. ఈ సర్వీసును దశల వారీగా ప్రారంభించాలనుకుంటున్నారు.
అలప్పుజా బ్యాక్ వాటర్స్‌లో అక్టోబరు నుంచి నాలుగు బోట్లతో జిల్లా వ్యాప్తంగా సర్వీసు అందించనున్నారు. స్టేట్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఈ న్యూ వాటర్ సర్వీస్ ఇంప్లిమెంట్ చేసేందుకు పూర్తిస్థాయిలో స్టడీ చేసింది. డీజిల్ ఇంజిన్లతో నడిచే బోట్లనే ఆర్డర్ చేసి తెప్పించారు.
షాజీ వీ నాయర్, డైరక్టర్, ఎస్‌డబ్ల్యూటీడీ మాట్లాడుతూ.. ‘రోడ్లపై ట్యాక్సీలు నడిచినట్లుగానే ఈ పడవలు పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉంటాయి. వారికి ఫోన్ చేసి రైడ్ బుక్ చేసుకుంటే వచ్చి పికప్ చేసుకుని గమ్యస్థానంలో డ్రాప్ చేసి వెళ్తారు. వీటి ధరలను గంటల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇది క్యాటమరాన్ డీజిల్ పవర్‍డ్ బోట్ కావడంతో పాటుగా 10మంది కూర్చొనే కెపాసిటీతో ఉంటుంది. గంటకు 15నాటికల్ మైల్స్ వేగంతో ముందుకెళ్తుంది. తద్వారా ప్రయాణికులు గమ్యస్థానాలకు వేగంగా చేరుకునే వీలుంది. ఈ వాటర్ ట్యాక్సీలు ప్రత్యేకించి ఒకే రూట్‌లో వెళ్తాయనుకోవడానికి లేదు. బోట్ స్టేషన్‌లతో కమ్యూనికేషన్ ను బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సర్వీసులు అందిస్తాయి.
తొలి దశలో అక్టోబర్ నెల 4బోట్లతో మొదలుపెట్టనుండగా, రెండో దశలో మరో మూడు బోట్లను తీసుకురానున్నారు. వీటికి చెల్లించాల్సిన టిక్కెట్ ధరలు లాంటి వాటిని ప్రభుత్వం ఇంకా డిసైడ్ చేయలేదు. ఇతర పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లతో పోల్చి చూసి బెటర్, రీజనబుల్ ధరలతోనే అందుబాటులోకి తేవాలని అనుకుంటున్నారు.