Covid-19 పేషెంట్లకు ఆటోమేటెడ్ ఫోన్ కాల్స్.. ఎందుకో తెలుసా?

ఫిబ్రవరిలో మెడికల్ స్టూడెంట్ చైనాలోని వూహాన్ నుంచి భారత్ కు వచ్చింది. కేరళలోని అలప్పుఝా వచ్చిన కొద్ది రోజుల వైరస్ సోకినట్లు తెలిసి.. ఆమె ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులను హాస్పిటల్‌కు తరలించారు. కొందరికి హోం క్వారంటైన్ ను సూచించారు. కొద్ది రోజుల వరకూ డా. శరత్ చంద్ర బోస్.. జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్ రోజూ ఫోన్ కాల్స్ చేసి పరిస్థితుల గురించి ఆరా తీసేవారు.
200మంది వరకూ ఇళ్లలోనే ఐసోలేషన్లోనే ఉన్నారు. దీంతో వారికి రోజూ ఫోన్ చేయడం పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. కొద్ది వారాల తర్వాత కొవిడ్ 19 రెండో దశ మొదలైంది. అలప్పుజా మాత్రమే కాకుండా కేరళ మొత్తం… యూరప్, గల్ఫ్ వంటి విదేశాల నుంచి తిరిగొచ్చిన వారి ద్వారా వ్యాప్తి జరిగింది. 200 మంది పేషెంట్లు కాస్తా.. 6వేలకు పెరిగారు.
వారి సమాచారం తెలుసుకునేందుకు 10 నుంచి 20 మందిరి రిక్రూట్ చేసుకుని క్వారంటైన్ లో ఉన్నవారి సమాచారం సేకరించడం మొదలుపెట్టాం. అయినప్పటికీ అందరికీ ఫోన్ కాల్స్ చేయలేకపోయాం. రోజుకు కేవలం 10ఫోన్ లైన్ల ద్వారా 600మందితో మాట్లాడేవాళ్లం. దీనిని బట్టి ఒక వ్యక్తికి మళ్లీ ఫోన్ చేయాలంటే 10రోజులు కచ్చితంగా పడుతుంది.
డా.బోస్ స్నేహితుడి సూచన మేరకు కొచ్చికి చెందిన ఇంటరేక్టివ్ వాయీస్ రెస్పాన్స్(ఐవీఆర్) హెల్ప్ తీసుకున్నారు. కొద్ది రోజుల్లోనే కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ద్వారా సొల్యూషన్ కనిపెట్టారు. టెక్నాలజీ సింపుల్ అయిపోయింది. మనుషులను పెట్టి ఫోన్ కాల్స్ మాట్లాడించే కంటే క్వారంటైన్ లో ఉన్నవారికి ఆటోమేటెడ్ ఫోన్ కాల్స్ ఈజీగా చేసేయొచ్చు.
ఇప్పుడు ఐవీఆర్ తో ఫోన్ చేసి క్వారంటైన్ లో, ఐసోలేషన్లో ఉన్న వారి పరిస్థితి తెలుసుకుంటున్నారు. వచ్చే కమాండ్ల ద్వారా లక్షణాలు ఎలా ఉన్నాయి. మీ సమస్యను బట్టి ఆప్షన్ సెలక్ట్ చేసుకోండంటూ వాయీస్ వినిపిస్తుంటే నొక్కుకుంటూ వెళ్లిపోవడమే. ఫలితంగా ప్రతి పేషెంట్ తో కమ్యూనికేట్ అవడం కుదురుతుంది. అందరి ఆరోగ్య పరిస్థితిపై ఫోకస్ పెట్టగలుగుతున్నామని డా.బోస్ అంటున్నారు. ఇలా పేషెంట్లతో మాట్లాడుతుంటే వారిలో మానసికంగానూ మంచి మార్పులు వస్తున్నట్లు గమనించారు.