Supreme Court: జీవిత ఖైదు వేయలేము.. తెలంగాణ ఆటోడ్రైవర్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

కిడ్నాప్ చేసి ఆ వ్యక్తిపై కిడ్నాపర్ దాడి చేయకపోతే, చంపేస్తానని బెదిరించకపోతే, అతనితో మంచిగా ప్రవర్తించినట్లయితే, కిడ్నాపర్‌కు ఐపీసీ సెక్షన్ 364ఏ కింద జీవిత ఖైదు విధించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Supreme Court: జీవిత ఖైదు వేయలేము.. తెలంగాణ ఆటోడ్రైవర్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Kidnapper Cannot Be Sentenced For Life If He Treats Victim Well Sc

Updated On : July 1, 2021 / 7:17 PM IST

Kidnap Case: కిడ్నాప్ చేసి ఆ వ్యక్తిపై కిడ్నాపర్ దాడి చేయకపోతే, చంపేస్తానని బెదిరించకపోతే, అతనితో మంచిగా ప్రవర్తించినట్లయితే, కిడ్నాపర్‌కు ఐపీసీ సెక్షన్ 364ఏ కింద జీవిత ఖైదు విధించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈమేరకు తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టి పరిశీలన చేసింది.

కిడ్నాప్ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ శిక్షను రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించగా.. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ వ్యక్తి అయిన షేక్ అహ్మద్ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. 2011లో 13ఏళ్ల వయస్సు ఉన్న ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఆటో డ్రైవర్ అహ్మద్ కిడ్నాప్ చేసి బాలిక తండ్రి దగ్గర నుంచి రూ. రెండు లక్షలు డిమాండ్ చేశాడు. తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకుని బాలికను రక్షించారు.

తర్వాత అహ్మద్‌కు ఐపీసీ సెక్షన్ 364ఏ కింద జీవిత ఖైదు విధించింది తెలంగాణ హైకోర్టు. జీవితఖైదును తగ్గించాలంటూ అహ్మద్ హైకోర్టు‌లో పిటీషన్ వెయ్యగా పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు. దీంతో సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. అక్కడ పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు.. సెక్షన్ 364ఏ(కిడ్నాప్) కింద నిందితుడిని దోషిగా నిర్ధారించడానికి, ప్రాసిక్యూషన్ మూడు విషయాలను నిరూపించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.

మొదట ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బందీగా ఉంచినట్లుగా ఆధారాలు. కిడ్నాపర్‌ను చంపేస్తానని బెదిరించడం లేదా దాడి చేసినట్లుగా ఆధారాలు, బాధితుడిని విడిచిపెట్టేలోపు హాని కలిగించినట్లుగా ఆధారాలు.. సెక్షన్ 364ఏ కింద జీవిత ఖైదు లేదా మరణశిక్షను విధించాలంటే, మొదటి షరతుతో పాటు, రెండవ, మూడవ షరతులను నిరూపించాల్సి ఉందని సుప్రీంకోర్టు తెలిపింది.