Kolkata Durga Puja: కోల్‌కతా దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు
కోల్‌కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు దక్కింది. యునెస్కో ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీ వార్షిక సదస్సులో భాగంగా జరిగిన 16వ సెషన్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మన సంస్కృతిని

Kokatta Durga Puja
Kolkata Durga Puja: కోల్‌కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు దక్కింది. యునెస్కో ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీ 16వ వార్షిక సదస్సులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమాలను డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 18వరకూ ఆన్ లైన్ లో నిర్వహించారు.
దీనిపై స్పందించిన మోదీ… ‘ప్రతి భారతీయుడు గర్వించడంతో పాటు సంతోషించదగ్గ విషయం. దుర్గా పూజ మన సంప్రదాయాలను, సంస్కృతిని హైలెట్ చేస్తుంది. కోల్‌కతా దుర్గా పూజ అనుభవం అందరికీ కావాల్సిందే’ అని అన్నారు పీఎం మోదీ.
యునైటెడ్ నేషనల్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) మీడియాకు తెలిపిన రిపోర్టులో దుర్గాపూజ ప్రత్యేకత గురించి వివరించింది.
………………………………. : ధనుర్మాసం…నేటి నుంచి ప్రారంభం
కళాకారులు, డిజైనర్లు సంయుక్తంగా మతాన్ని, కళను బహిరంగ ప్రదర్శనలోనే కనబరుస్తారని యునెస్కో చెప్పింది.
ఏటా జరుపుకునే ఈ పండుగను దేశంలోని పలు ప్రాంతాల్లో జరుపుకున్నప్పటికీ.. కోల్‌కతాలో ప్రత్యేకంగా జరుగుతుంది. పది రోజుల పాటు జరిగే ఈ పండుగలో దేవతాలంకరణ అద్భుతంగా జరుగుతుంది. గంగా నది తెచ్చిన మట్టితో అమ్మవారి ప్రతిమను తయారుచేస్తారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెస్పాండ్ అయి ‘ఇది ప్రతి బెంగాలీ గర్వించదగ్గ క్షణం. పండుగ కంటే ఎక్కువ. అందరినీ కలిపే ఒక ఎమోషన్’ అని ట్వీట్ ద్వారా వెల్లడించారు.