తెగిన చెరువు..కాలనీలు జలమయం : 200 కుటుంబాలు తరలింపు

ఆదివారం మధ్యాహ్నం  హాయిగా భోజనం చేసి ఒక చిన్న కునుకు తీద్దామనుకున్న బెంగుళూరు వాసులకు నిద్రలేకుండా చేసింది హులిమావు చెరువు. చెరువు కట్టతెగి నీరంతా సమీపంలోని కాలనీల్లోకి ప్రవేశించింది. ఉరుముల్లేని పిడుగులాగా ఒక్క దెబ్బకు  రోడ్లమీదకు వచ్చిన నీరు కాలనీలను ముంచెత్తే సరికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బెంగుళూరులోని హులిమావు, బీటీఎం లేఅవుట్ ప్రాంతాల్లో నవంబర్ 24 సాయంత్రం చోటు చేసుకున్నసంఘటన ఇది. 

  • Published By: chvmurthy ,Published On : November 25, 2019 / 06:46 AM IST
తెగిన చెరువు..కాలనీలు జలమయం : 200 కుటుంబాలు తరలింపు

Updated On : November 25, 2019 / 6:46 AM IST

ఆదివారం మధ్యాహ్నం  హాయిగా భోజనం చేసి ఒక చిన్న కునుకు తీద్దామనుకున్న బెంగుళూరు వాసులకు నిద్రలేకుండా చేసింది హులిమావు చెరువు. చెరువు కట్టతెగి నీరంతా సమీపంలోని కాలనీల్లోకి ప్రవేశించింది. ఉరుముల్లేని పిడుగులాగా ఒక్క దెబ్బకు  రోడ్లమీదకు వచ్చిన నీరు కాలనీలను ముంచెత్తే సరికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బెంగుళూరులోని హులిమావు, బీటీఎం లేఅవుట్ ప్రాంతాల్లో నవంబర్ 24 సాయంత్రం చోటు చేసుకున్నసంఘటన ఇది. 

ఆదివారం మధ్యాహ్నం  హాయిగా భోజనం చేసి ఒక చిన్న కునుకు తీద్దామనుకున్న బెంగుళూరు వాసులకు నిద్రలేకుండా చేసింది హులిమావు చెరువు. చెరువు కట్టతెగి నీరంతా సమీపంలోని కాలనీల్లోకి ప్రవేశించింది.  లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. అపార్ట్ మెంట్లలోని సెల్లార్ల లోకి నీరు ప్రవేశించి వాహనాలు నీట మునిగాయి. ఉరుముల్లేని పిడుగులాగా ఒక్క దెబ్బకు  రోడ్లమీదకు వచ్చిన నీరు కాలనీలను ముంచెత్తే సరికి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బెంగుళూరులోని హులిమావు, బీటీఎం లేఅవుట్ ప్రాంతాల్లో నవంబర్ 24 సాయంత్రం చోటు చేసుకున్నసంఘటన ఇది. 

బెంగుళూరులో 140 ఎకరాల విస్తీర్ణంలో హులిమావు చెరువు విస్తరించి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిండిన చెరువు నిండు కుండని తలపిస్తోంది. చెరువు సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఎవరైనా బోరు వేయటానికి డ్రిల్లింగ్ వేసే సరికి చెరువు కట్టతెగి ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని నగర మేయర్ గౌతమ్ కుమార్ చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 
“మధ్యాహ్నం గం.1:30 గంటలకు సమయంలో  నీరు  కొద్ది కొద్దిగా బయటకు రావటం మొదలైంది. ఇది సాయంత్రం గం.4:45కు అధిక స్థాయిలో బయటకు రావటం మొదలైందని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు.  సాయంత్రం 6 గంటలకు, చెరువులోని నీరు వివేకానంద రోడ్‌లోని  కమర్షియల్ కాంప్లెక్స్ ల్లోకి ప్రవేశించింది. ఈ ప్రాంతంలోని సెల్లార్ లలోకి నీరు చేరింది. వీధులన్నీజలమయమయ్యాయి. 

చెరువు కట్ట తెగిందనే సమాచారం అందుకున్న వెంటనే బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు, బీబీఎంపీ కమిషనర్ బీహెచ్ అనిల్ కుమార్ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు పల్లపు ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. 200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెండు నెలల క్రితం, బిబిఎంపి అధికారులు  చెరువు కట్టలు పటిష్ట పరిచే పనిలో భాగంగా చెరువు అవుట్ ఫ్లో వెళ్లే తూమును కూడా మూసివేశారు. గొట్టిగెరె చెరువు, బన్నర్‌గట్టలోని కాలువ నుండి మురుగునీరు హులిమావు సరస్సులోకి ప్రవహించడం ప్రారంభమైంది. వీటికి తోడు ఇటీవల దక్షిణ బెంగళూరులో కురిసిన వర్షాల కారణంగాకూడా సరస్సు నిండిపోయింది. దీంతో నీటిని తట్టుకోలేని కట్టలు బలహీన పడి  నీరు కాలనీలను ముంచెత్తింది. హలిమావులోని స్థానిక అధికారుల సహకారంతో ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది తాత్కాలిక గోడను తయారు చేసి బండ్ నుండి నీటి ప్రవాహాన్ని ఆపగలిగారు.