Lalu Prasad Yadav: మెరుగ్గా లాలూ ఆరోగ్యం.., “పుకార్లు నమ్మొద్దు”

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మెరుగువుతోందని కుమారుడు తేజస్వి యాదవ్ వెల్లడించారు. పట్నా హాస్పిటల్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.

Lalu Prasad Yadav: మెరుగ్గా లాలూ ఆరోగ్యం.., “పుకార్లు నమ్మొద్దు”

Lalu Prasad Yadav

Updated On : July 8, 2022 / 10:17 AM IST

Lalu Prasad Yadav: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మెరుగువుతోందని కుమారుడు తేజస్వి యాదవ్ వెల్లడించారు. పట్నా హాస్పిటల్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించగా వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, గతం కంటే మెరుగ్గా ఉందని వెల్లడించిన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఢిల్లీ ఎయిమ్స్‌ కిడ్నీ, ఆర్థో, కార్డియాక్ విభాగాల వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. కిడ్నీ, గుండె, రక్తపోటు, మధుమేహం సంబంధ వ్యాధులతో లాలూ బాధపడుతున్నారు.

ఆదివారం తన నివాసంలోని మెట్లపై నుంచి జారీపడటంతో కుడి భుజం ఎముకలు విరిగి.. గాయాలయ్యాయి. కిడ్నీ, గుండెపై పెద్దగా ప్రభావితం చూపలేదని కుటుంబ సభ్యులకు వైద్యులు వెల్లడించారు. ఎయిమ్స్‌లో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు లాలూ ఆరోగ్యం మెరుగుపడుతుందని తేజస్వి ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also: అవ‌స‌ర‌మైతే లాలూను చికిత్స కోసం సింగ‌పూర్‌కు తీసుకెళ్తాం: తేజ‌స్వీ యాదవ్

ఐసియూలోనే వైద్యుల పర్యవేక్షణలో లాలూ ఉన్నారని తేజస్వి యాదవ్ తెలిపారు. ప్రజలు ఎలాంటి పుకార్లు నమ్మొద్దని వెల్లడించారు తేజస్వి.