లాక్‌డౌన్ కారణంగా భారీగా తగ్గిన కాలుష్యం.. జలంధర్‌ నుంచి కనిపిస్తున్న 200 కిమీ దూరంలో ఉన్న హిమాలయాలు

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : April 5, 2020 / 06:25 PM IST
లాక్‌డౌన్ కారణంగా భారీగా తగ్గిన కాలుష్యం.. జలంధర్‌ నుంచి కనిపిస్తున్న 200 కిమీ దూరంలో ఉన్న హిమాలయాలు

Updated On : April 5, 2020 / 6:25 PM IST

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హిమాలయాలకు 200కిలోమీటర్ల దూరంలో ఉన్న పంజాబ్‌లోని జలంధర్‌ నుంచి కూడా హిమాలయాలు కనిపించాయి. ఓ సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది.

లాక్ డౌన్ కారణంగా గంగా నది కొంతవరకూ ప్రక్షాళన జరిగింది. నిజమే గంగా నది మాత్రమే కాదు ఇప్పుడు ఆకాశం కూడా ఊపిరి పీల్చుకుంటోంది నిర్మలంగా మారింది. ఒక అద్భుత దృశ్యాన్ని జలంధర్ వాసుల ముందు ఆవిష్కరించింది. అదేంటో మీరూ చూడండి. పొద్దున్నే నిద్ర లేచిన పంజాబ్ లోని జలంధర్ నగర వాసులు ఒక అద్భుత దృశ్యాన్ని తిలకిస్తున్నారు. గుంపులు గుంపులుగా డాబాల పైకి చేరుతున్నారు. మంచు కప్పుకున్న పర్వతాల్ని చూసి సంతోషం పట్టలేక పోతున్నారు. తమ కెమెరాల్లో ఆ దృశ్యాల్ని బంధిస్తున్నారు.

హిమాలయ పర్వత శ్రేణికి చెందిన దువాల్దర్ పర్వతాలవి. జలంధర్ కు 213  కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం జలంధర్ వాసులకు వాటి గురించి తెలుసు. జలంధర్ నుంచి అవి కనిపించేవి. ఇప్పటి తరానికి ఇది కొత్త అనుభవం. అందుకే వృద్ధులు ఈ దృశ్యం చూసి అబ్బో ఎన్నేళ్ళయిందో అంటున్నారు. వాతావరణం లో పెరిగిన కాలుష్యం కారణంగా ఇంతకాలం అవి కంటికి కనిపించకుండా పోయాయి. ఇప్పుడు దేశవ్యాప్త లాక్ డౌన్ వాతావరణం లో కాలుష్యాన్ని తగ్గించింది. అదే జలంధర్ వాసులకు కన్నుల పండగగా మారింది.