Manipur Violence: మణిపూర్‭లో శాంతిభద్రతలు విఫలం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు

Manipur Violence: మణిపూర్‭లో శాంతిభద్రతలు విఫలం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

Updated On : June 16, 2023 / 2:58 PM IST

RK Ranjan: మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి ఆర్.కే.రంజన్ సింగ్ అన్నారు. గత నెల రోజుల నుంచి మణిపూర్‭లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుస పర్యటనలు చేస్తూ శాంతిభద్రతల్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన తోటి మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ఒక్కసారిగా షాక్‭కు గురయ్యాను. మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి’’ అని మంత్రి రంజన్ అన్నారు.

AP Politics: వపన్ హీరోయిజం నుంచి జీరోయిజానికి వచ్చారు.. ‘ఒక్క ఛాన్స్’ రిమార్క్‭పై ఆర్జీవీ సెటైర్

వాస్తవానికి 1000 మంది ఆందోళనకారులు మూకుమ్మడిగా ఆర్కే రంజన్ ఇంటిపై దాడి చేసి, దహనం చేశారు. ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంఫాల్‌లోని ఇంట్లో లేరని మణిపూర్ అధికారులు తెలిపారు. ఇంఫాల్‌లో కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళనకారులు కొంగ్బాలోని మంత్రి ఇంటిపై దాడి చేశారు. అంతకు ముందే మంత్రి ఇంటి వద్ద భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ వారి కంటే ఎక్కువ మంది ఆందోళనకారులు అక్కడికి చేరుకుని ఈ దారుణానికి తెగబడ్డారు.

NMMLS: నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరేంటో తెలుసా?

దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో మంత్రి నివాసంలో 9 మంది సెక్యూరిటీ ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డులు, 8 మంది అదనపు గార్డులు ఉన్నారు. 1200 మంది ఆందోళనకారులు ఉండవచ్చని ఎస్కార్ట్ కమాండర్ తెలిపారు. దాడి సమయంలో ఆందోళనకారులు నలువైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరినట్లు మంత్రి ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది తెలిపారు.

Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

కాగా, మంత్రి ఇంటిపై మూకుమ్మడి దాడి జరగడం ఇది రెండోసారి. మే నెలలో జరిగిన దాడిలో ఆందోళనకారుల గుంపును చెదరగొట్టడానికి భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. తన ఇంటిపై దాడి జరిగిన సమయంలో తాను అధికారిక పనిపై కేరళ రాష్ట్రంలో ఉన్నట్లు మంత్రి రంజన్ సింగ్ చెప్పారు. తన ఇల్లు పెట్రోలు బాంబుల దాడిలో దెబ్బతిందని మంత్రి చెప్పారు. మణిపూర్ లో శాంతి స్థాపనకు అందరూ కలిసి రావాలని కేంద్రమంత్రి సింగ్ కోరారు.