వర్మ కేసులో సుప్రీం తీర్పుపై …ఎవరేమన్నారంటే

  • Published By: venkaiahnaidu ,Published On : January 8, 2019 / 08:17 AM IST
వర్మ కేసులో సుప్రీం తీర్పుపై …ఎవరేమన్నారంటే

అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరక్టర్ గా భాధ్యతలు అప్పగించాలంటూ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దీనిపై పలువురు నాయకులు, ప్రముఖులు స్పందించారు. సుప్రీం తీర్పుపై ఎవరేమన్నారో ఇప్పుడు చూద్దాం

అరుణ్ జైట్లీ:       ఇది ఒక సంస్థ భద్రతకు సంబంధించిన విషయం. రాజకీయ కోణంలో దీన్ని చూడగూడదు. వర్మ కేసులో సుప్రీం తీర్పు ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుది. సీబీఐ డైరక్టర్ కు ఇవ్వబడిన ఇమ్యూనిటీని కోర్టు బలపరిచింది. సీవీసీ రికమండేషన్ ప్రకారమే అలోక్ వర్మను సీబీఐ డైరక్టర్ పదవి నుంచి ప్రభుత్వం తొలిగించింది. ఆస్తానా, వర్మలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వారు వారి మధ్య విభేధాలు బయట పరిష్కరించుకోవాలని  సంస్థ నుంచి బయటకు పంపిచడం జరిగింది. 

కాంగ్రెస్:      సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. అలోక్ వర్మను ప్రభుత్వం అర్థాంతరంగా పంపించడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాం 

ప్రశాంత్ భూషణ్:      అలోక్ వర్మకు ఇది అసంపూర్ణ విజయం

 అరవింద్ కేజ్రీవాల్: సీబీఐ డైరక్టర్ గా అలోక్ వర్మ నియామకానికి సంబంధించిన సుప్రీం తీర్పు ప్రధానిపై ప్రత్యక్ష నేరారోపనే.మోడీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని, అన్నీ సంస్థలను నాశనం చేసింది. రాఫెల్ స్కామ్ పై విచారణ జరుగకూడదనే కదా అర్థరాత్రి అలోక్ వర్మను సీబీఐ డైరక్టర్ పదవి నుంచి కేంద్రం తప్పించింది.

మల్లిఖార్జున ఖర్గే: సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వానికి ఇది ఒక పాఠం