gold nose pin : కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే..ముక్కు పుల్ల ఫ్రీ

గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో ఓ బంగారం వ్యాపారుల సంఘం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది...

gold nose pin : కరోనా వ్యాక్సిన్ వేసుకుంటే..ముక్కు పుల్ల ఫ్రీ

gold nose pin

Updated On : April 5, 2021 / 1:59 PM IST

Gujarat’s Rajkot : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్‌ మొదటిస్థానానికి చేరింది. అమెరికా, బ్రెజిల్‌ను బీట్‌ చేసి పడేసింది. ఐదు నెలల తర్వాత అమెరిక, బ్రెజిల్‌ను దాటి భారత్‌లో కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్‌వేవ్‌ వ్యాప్తి దేశంలో ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోంది. మరోవైపు..కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరుగా జరుగుతోంది. అయితే..చాలా మంది ప్రజలు టీకా వేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు.

ప్రభుత్వ వైద్యాధికారులు, ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా…మనకెందుకులే..ఇప్పుడు తర్వాత చూద్దామని చాలా మంది అనుకుంటున్నారు. ఈ క్రమంలో…గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో ఓ బంగారం వ్యాపారుల సంఘం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ప్రజల్లో చైతన్యం పెంచుతూ..వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో టీకా వేయించుకొనే వారి కోసం ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ వేయించుకొనే మహిళలకు ఫ్రీగా ముక్కుపుల్ల ఇస్తామని చెబుతోంది. మరి పురుషులు వేసుకుంటే…వారికి హ్యాండ్ బ్లెండర్ ఫ్రీగా ఇస్తామని వెల్లడించింది.

Read More : Assembly Elections 2021 : ఆ రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఇక పోలింగ్ జరగడమే తరువాయి