ప్రజలకు ఊరట : కొన్ని షాపులకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం

లాక్ డౌన్ విధించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులు గుర్తించి కేంద్రం మరి కొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రజలకు కొంత ఊరట లభించనుంది.
లాక్‌డౌన్ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్ ప్రాంతాల్లోని నాన్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పలు మినహాయింపులు ఇచ్చింది. నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్నింటికి మినహాయింపు ఇవ్వగా.. ఆ జాబితాలోకి మరికొన్నింటిని చేర్చింది.
అర్బన్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ దుకాణాలు, స్టేషనరీ షాపులకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ తెలిపారు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, మొబైల్ రీఛార్జి దుకాణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తాయని తెలిపారు.
రహదారి నిర్మాణ పనులు, సిమెంట్ యూనిట్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హాట్ స్పాట్ కేంద్రాలకు ఇవి వర్తించబోవన్నారు. ఈ మేరకు వివిధ శాఖల సంయుక్త మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు
ప్రభుత్వం కొత్తగా మినహాయింపు ఇచ్చిన వాటిలో
పుస్తకాలు, స్టేషనరీ షాపులు
నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు
మొబైల్ రిచార్జ్ షాపులు
ఆటా కంపెనీలు
రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్ దుకాణాలు
సిమెంట్ విక్రయాలకు అనుమతి
పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు.